Saudi king gifts gold toilet for daughter marriage

saudi king abudllah daughter marriage, saudi king gold toilet gift, saudi king abdullah, gold toilet, saudi king abdullah wives, rich marriages, kings marriages, saudi arebia kings, gold frocks, latest updates

saudi king gifts gold toilet for daughter marriage : king of saudi arebia abdullah gifte a gold toilet to her daughter as a marriage gift and also presents frock worth rupees 3crore dollars

కూతురు పెళ్ళికి బంగారు టాయ్ లెట్ బహుమతిచ్చాడు

Posted: 10/16/2014 11:16 AM IST
Saudi king gifts gold toilet for daughter marriage

సౌది రాజులు, షేక్ ల గురించి మనకు చాలానే తెలుసు. లెక్కకు మించిన డబ్బు, వారు అనుభవించే రాజభోగాల గురించి చాలాసార్లు విన్నాము. ఇక సౌది రాజు అబ్దుల్లా రాజభోగం గురించి ఎంత చెప్పినా తక్కవే. ఆయన కార్లు.., కుటంబం, భార్యలు వారి ఖర్చుల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. తాజాగా ఈ రాజు తన కూతురు వివాహంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డబ్బును నీళ్ళకంటే మరీ ఎక్కువగా ఖర్చుపెట్టి పెళ్లి చేశాడు. తాను అల్లారుముద్దుగా పెంచిన కూతురును అత్తవారింట బంగారంలా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో పెళ్ళిని బంగారుమయం చేశాడు.

ఎంతలా అంటే.., టాయ్ లెట్ ను కూడా బంగారంతో చేయించాడు. పాశ్చాత్య మోడల్ లోని టాయ్ లెట్ ను పూర్తిగా స్వచ్చమైన స్వర్ణంతో తయారు చేయించారు. అందులోని పరికరాలు కూడా మేలిరకం పుత్తడివేనట. అయితే దీని విలువను మాత్రం బయటకు చెప్పలేదు. కుమార్తె పెళ్ళి గౌను కోసం ఏకంగా మూడు కోట్ల డాలర్లు ఖర్చుపెట్టాడు. ఇదంతా బంగారంతో తయారు చేయించారట. ఇలా అంగరంగ వైభవంగా.. అంతా చెప్పుకునేలా కూతురు వివాహం జరిగింది. ఈ పెళ్లి, బహుమతుల విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

పెళ్ళి సందర్బంగా కూతురు కొత్త కాపురంకు కావాల్సిన అన్ని సామాన్లు ఇవ్వటం ముస్లింలతో పాటు ఇతర మతాల్లో కూడా సాంప్రదాయంగా వస్తుంది. కనీస అవసరాల నుంచి స్థాయిని బట్టి విలాసాల వరకు సమకూరుస్తారు. కాని ఇలా పుత్తడి టాయ్ లెట్ బహుమతి ఇవ్వటం అంటేనే ఈ రాజు విలాసం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇక కుటుంబం విషయానికి వస్తే అబ్దులా గారికి 11మంది భార్యలు, 16మంది సంతానం ఉన్నారు. ప్రతి సారి ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు, ధనవంతులైన ముస్లిం కుబేరుల జాబితాలో అబ్దుల్లా పేరు ఉంటుంది. ఇంతకీ ఆయన ఆస్తి విలువ ఎంత అంటే 21బిలయన్ డాలర్ల పైమాటే అని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saudi king abdullah  marriages  gifts  world latest updates  

Other Articles