Check to bogus voters through aadhaar

check, bogus voters, Aadhaar, voter id card, GHMC, commissioner, chief electoral officer, banwar lal, somesh kumar

check to bogus voters through Aadhaar, by linking both

ఆధార్ తో బోగస్ ఓట్లర్లకు చెక్..!

Posted: 10/14/2014 02:47 PM IST
Check to bogus voters through aadhaar

ఎన్నికలు వచ్చాయంటే చాలు మా ఇంట్లో ఇన్ని ఓట్లు వున్నాయి. అన్ని వున్నాయంటూ అభ్యర్థుల వద్దకెళ్లి భేరసారాలాడే వారిని మనం చూస్తుంటాం. ఇక ఇలాంటి వారికి చెక్ పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఓటరు కార్డులను ఆధార్‌కార్డులతో అనుసంధానించే కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనుంది. దీని ద్వారా బోగస్ కార్డులను ఏరివేయడంతోపాటు.. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగ్గలదని అంచనా వేస్తున్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ లో దీనిని అమలు చేశాక..  మిగతా ప్రాంతాలకూ దీన్ని వర్తింపచేయనున్నారు.

ఆధార్ కార్డుతో ఓటరు కార్డుల లింకు వల్ల గ్రేటర్ పరిధిలో ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య పెరగనుంది. తెలంగాణలో 2. 63  కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 81.54 లక్షల ఓటర్లున్నారు. వీటిల్లో డూప్లికేట్లు భారీ సంఖ్యలో ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ రెండు కార్డులు అనుసంధానం ద్వారా బోగస్ ఓటర్లను తొలగించేందుకు వీలవుతుంది. చిరునామా మారిన వారు, మృతి చెందిన వారి పేర్లు సైతం ఓటరు జాబితాలో ఉన్నాయన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్‌తో అనుసంధానం ద్వారా వాటిని తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల నమోదు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, గ్రేటర్‌లో ఆశించిన స్థాయిలో ఓటర్లు నమోదు చేసుకోవడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌శాతం కేవలం 52-54 శాతంగా నమోదైంది. రాబోయే ఎన్నికల నాటికి ఓటరు జాబితాలో పేరు నమోదుకు.. తద్వారా పోలింగ్ శాతం పెంపునకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

నిర్ణీత వ్యవధిలోగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పూనుకున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా  నాలుగు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని, ఫలితాలను బట్టి మిగతా నియోజకవర్గాల్లోనూ చేపట్టనున్నారు. ఆధార్‌ కార్డులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానించనున్నారు. దీంతో డూప్లికేట్లు , మృతులు , తదితరుల పేర్లు తొలగించేముందు నిర్ధారణ కోసం ఎన్నికల సిబ్బందిని ఇళ్లవద్దకు పంపించనున్నారు.. ఓటర్లే తమ ఆధార్ వివరాలను తెలిపేందుకు వీలుగా టోల్‌ఫ్రీ ద్వారా ఎస్‌ఎంఎస్, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయడం వంటి విధానాలను కూడా అందుబాటులోకి తీసుకుమన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : check  bogus voters  Aadhaar  voter id card  GHMC  commissioner  chief electoral officer  banwar lal  somesh kumar  

Other Articles