Ap cm asks to give support for cyclone victims

hudhud cyclone, hudhud meaning, hudhud cyclone latest updates, hudhud cyclone updates, hudhud cyclone losses, national disaster, national disaster relief team, latest updates, andhrapradesh, andhrapradesh news, telugu latest updates, andhrapradesh government, cyclones, hudhud cyclone result, hudhud cyclone effected areas, hudhud cyclone in andhrapradesh, kcr, telangana, telangana government, chandrababu naidu, narendra modi

andhrapradesh chief minister chandrababu naidu asks every one to give helping hand to andhrapradesh : hudhud cyclone resulted badly in andhrapradesh and odisha states ap cm announced immediate relief to victims and asked central government to help the state

హుద్ హుద్ : ఉత్తరాంధ్రలో అతలాకుతలం కోస్తాంధ్రలో కకావికలం

Posted: 10/13/2014 06:33 PM IST
Ap cm asks to give support for cyclone victims

హుద్ హుద్ తుఫానుతో విలవిల లాడిన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే భీకర పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది. దీని ఫలితంగా రాగల 24గంటల్లో విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షాపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తాజా తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ కు అపారనష్టం మిగిలింది. పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు, వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇక వందల సంఖ్యలో ఇళ్ళు నేలమట్టం కాగా.., వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం కాగా.., కోస్తాంధ్ర కకావికలం అయింది.

తుఫాను వల్ల సోమవారం సాయంత్రం వరకు విశాఖ జిల్లాలో ఐదుగురు చనిపోయారు. అటు విజయనగరం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.., శ్రీకాకుళంలో మరొ ముగ్గురు బలయ్యారు. పదుల సంఖ్యలో పశువులు కూడా మృత్యువాత పడ్డాయి చాలావరకు ఇళ్ళు దెబ్బతిన్నాయి. భీకరమైన గాలుల తీవ్రతకు భవనాలు సైతం దెబ్బతిన్నాయి.., సాధారణ ఇళ్ళు కుప్పకూలాయి. తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్; సమాచార వ్యవస్థలను ప్రస్తుతం పునరుద్ధరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. తుపానుపై సమీక్ష జరిపిన చంద్రబాబు బాధితులను ఆదుకుంటామన్నారు. తుఫాను వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1లక్ష ప్రకటించారు. అదేవిధంగా మత్స్యకారుల పడవలు దెబ్బతింటే రూ. 25వేలు, వలలు నష్టపోతే రూ.5వేలు సాయం ప్రకటించారు. అటు పశువులు మృతి చెందితే రైతులకు రూ. 25వేల సాయం ప్రకటిస్తామన్నారు.

విశాఖలో విద్వంసం

అందాలకు నిలయమైన విశాఖపట్టణం, పరిసర ప్రాంతాలు హుద్ హుద్ తుఫాను ధాటికి భయంకరంగా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా.., విద్యుత్ స్థంభాలు, భారీ వృక్షాలు సైతం నేలకొరిగి ఎక్కడికక్కడ రోడ్లపై పడిపోయాయి. బీచ్ రోడ్డు సమీపంలోని రోడ్డు భారీగా దెబ్బతిన్నది. దీంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలు.., ఏజన్సీల్లో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. విశాఖలోనే మకాం వేసిన ముఖ్యమంత్రి తుఫాను ప్రభావం.., సహాయక చర్యలపై ఎఫ్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. పంటనష్టం, దెబ్బతిన్న ఇండ్లు, ఇతర ఆస్తినష్టాలపై త్వరలోనే వివరాలు సేకరిస్తామన్నారు. ఈ సందర్బంగా ఏపికి సాయం చేసేందుకు అంతా ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రకటనకు స్పందించి తమిళనాడు ప్రభుత్వం రూ. 5కోట్లు సాయం ప్రకటించింది. అటు కేరళ ప్రభుత్వం కూడా సాయం చేస్తామని ప్రకటించింది.

కోస్తాంధ్ర కోలుకోలేదు

ఉత్తరాంధ్ర జిల్లాల్లో హుద్ హుద్ తుఫాను వల్ల ఆస్తినష్టం జరిగితే.., కోస్తాంధ్ర జిల్లాల్లో భారీగా పంటనష్టం జరిగింది. వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఇక అరటి, కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. తుఫానుపై ముందస్తుగా అందరిని అప్రమత్తం చేసిన అధికారులు..,ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పంటనష్టంపై తుఫాను పూర్తిగా తొలగితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

హుద్ హుద్ పై కేంద్రం స్పందించింది. ఏపీని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు. బాధితులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వరద పరిస్థితిని సమీక్షించి, బాధితులకు సాయం చేసేందుకు ప్రధాని మంగళవారం రోజు విశాఖకు వస్తున్నారు. ఈ సందర్బంగా ప్రకృతి భీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ర్టాన్ని ఆదుకోవాలని డిమాండ్ విన్పిస్తోంది. ఈ మొర మోడికి విన్పించి పెద్దమనసుతో సాయం చేయాలని అంతా కోరుకుందాం. ప్రధాని.., ప్రభుత్వమే కాదు సాయం చేయాలని ఉన్న ఎవరైనా ఏపిని ఆదుకునేందుకు చేతులు కలపవచ్చు. అందులో మీరూ ఉంటామని ఆశిస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  hud hud cyclone  narendra modi  chandrababu naidu  

Other Articles