Isis terrorists flags appearing in jammu kashmir

isis news, isis full form, isis terrorist, isis iraq, isis abbrivation, islamic state news, isis flags, isis terrorists, islamic state flag, islamic state news, islamic state terrorist, islamic state cruelity, islamic state in kashmir, islamic state in india, islamic state jammu kashmir, latest news, terrorism, world terrorism, indians, hindu, muslims, latest rumors, national news, indian security forces, defence, bsf, border security forces

terrorist organisations islamic state flages are appearing in jammu kashmir security forces monitering the situation : security forces put eye on islamic state flag holders in kashmir and monitering on it

భారత్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద విస్తరణ

Posted: 10/13/2014 05:33 PM IST
Isis terrorists flags appearing in jammu kashmir

దారుణాలు, క్రూరమైన అకృత్యాలకు పాల్పడే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం ఇప్పుడు భారత లోకి విస్తరిస్తోంది. ఉపఖండంను చిన్నాభిన్నం చేసేందుకు మతం ముసుగులోని దుష్టశక్తి ప్రయత్నిస్తోంది. తాజాగా జమ్మూలో కన్పించిన ఇస్లామిక్ స్టేట్ జెండాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మనదేశంలోనూ ఈ సంస్థ ఉగ్రవాదులు, మద్దతుదారులు ఉన్నారన్న విషయం స్పష్టం అవుతోంది. మత రాజ్య కాంక్ష పేరుతో పెచ్చుమీరిన ఈ ఉగ్రవాదం దేశంలోకి ప్రవేశిస్తే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూలో కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాయి.

ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన ఓ ర్యాలిలో తొలిసారి ఇస్లామిక్ స్టేట్ సంస్థ జెండాలు జమ్మూలో కన్పించాయి. ఈ విషయాన్ని స్థానిక భద్రతా బలగాలు ఉన్నతాధికారులకు చేరవేశారు. వెంటనే అప్రమత్తమై ఈ జెండాలు.., ఉగ్రకదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్బంగానే రెండు నెలల క్రితం హైదరాబాద్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు ఈ సంస్థలో చేరేందుకు వెళ్తుండగా వారిని సరిహద్దులో పట్టుకుని వెనక్కి పంపించారు. అప్పట్లో ఇది సంచలనం కల్గించింది. తాజాగా బక్రీద్ సందర్బంగా జరిగిన ర్యాలిలో కొందరు వ్యక్తులు ఈ జెండాలను ప్రదర్శించటం జరిగింది. ముఖాలకు మాస్కులు వేసుకున్న వ్యక్తులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా జెండాలు పట్టుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

అయితే భారీ ర్యాలి చేపట్టిన నేపథ్యంలో సదరు వ్యక్తులను అరెస్టు చేస్తే పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదముందని పోలిసులు అలా చేయలేదని తెలుస్తోంది. జెండాలు ప్రదర్శించిన వ్యక్తులు ఎవరు, వారికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై ప్రస్తుతం అంతర్గతంగా ధర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే జమ్మూలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హుజ్పుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల కదలికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవిత్రయుద్ధం పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు మొదలు పెట్టిన ఐఎస్ఐఎస్ కూడా విస్తరిస్తే దేశంలో పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాబట్టి ముందస్తుగానే అప్రమత్తమై అణిచివేస్తామని నిఘా సంస్థలు చెప్తున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : islamic state terrorists  isis flag  kashmir  security forces  latest news  

Other Articles