Microsoft ceo satya nadella apologized

satya nadella, microsoft ceo, karma comments, women angry

Microsoft CEO Satya Nadella apologizes for saying 'women don't need to ask for a raise'

గ్రేట్.! తప్పు తెలుసుకున్నాడు.. క్షమాపణలు చెప్పాడు

Posted: 10/10/2014 01:55 PM IST
Microsoft ceo satya nadella apologized

మనవాడు, భారతీయుడు అందులోనూ మన తెలుగువాడు మైక్రోసాఫ్ట్ వంటి సంస్థకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని అందరం సంబరపడ్డాం. ఇప్పడు అంతకన్నా ఎక్కువ ఆనందపడాలి. ఎందుకంటే తప్పుల మీద తప్పులు చేసే వారు చాలా మంది. మనం కూడా తప్పులు చేయడం సహజం. అయితే తప్పులను తెలుసుకుని మసలుకునే వాడే మనిషి అని ఓ రచయిత అన్నట్టుగా మనవాడని గర్వంగా చెప్పుకుంటున్న సత్యనాదెళ్ల అదే పనిచేశారు. తాను చేసింది తప్పు అని తెలుసుకున్నాడో లేదో.. అంత పెద్ద ఉన్నత స్థానంలో వున్న ఆయన అదే స్థాయిలో తన క్షమాపణలు చెప్పారు.

ఆరిజోనాలో ఓ కంప్యూటింగ్ సదస్సులో స్టేజి మీద చర్చలో మాట్లాడుతుండగా మహిళలు కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నా, జీతాల పెంపు విషయంలో మాత్రం అసలు సంతృప్తిగా ఉండట్లేదని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించినప్పుడు నాదెళ్ల స్పందించారు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని, అప్పుడు మనకు పెరగాల్సిన జీతం అదే పెరుగుతుందని ఆయన అన్నట్లు సమాచారం. మహిళలు జీతాల పెంపు గురించి అడగక్కర్లేదని, వాళ్లు సత్కర్మలు చేస్తే ఆ పుణ్యం తిరిగొస్తుందని అన్నట్లు తెలిసింది. మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. సామాజిక వెబ్ సైట్లలో మహిళలు ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని కనబరస్తూ పోస్ట్ చేశారు.

అయితే సత్య నాదెళ్ల వాదనతో ఆ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించిన మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యురాలు, కాలేజి ప్రెసిడెంట్ మారియా క్లావే తీవ్రంగా విభేదించారు. వెంటనే ప్రేక్షకుల నుంచి కరతాళధ్వనులు మిన్నంటాయి. ఒకే ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకు తక్కువ జీతాలు వస్తున్నాయని ఇప్పటికే పలు పరిశోధనలలో తేలింది. దీన్ని కూడా పరిష్కరించాలని, ఇందుకోసం మహిళలు హోంవర్క్ చేయాలని క్లేవ్ సలహా ఇచ్చారు.

ఈ వివాదానికి సత్యనాదెళ్ల క్షమాపణలు చెప్పి తెరదించారు. ట్విట్టర్ ద్వారా వివరణ ఇస్తూ.. పరిశ్రమలో వేతనాల విషయంలో లింగ వివక్ష తగ్గాలని ఆయన అభిప్రాయపడ్డారు.. కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ మహిళలకు సూచించడంపై మైక్రోసాఫ్ట్ మహిళా ఉద్యోగులకు క్షమాపణలు కూడా చెప్పారు. తన వ్యాఖ్యల్లోని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. మహిళలను చులకన చేసి చూడటం తన అభిమతం కాదని వివరణ ఇచ్చారు. ఎంతైనా తెలుగోడు.. తెలివైనోడే అనిపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satya nadella  microsoft ceo  karma comments  women angry  

Other Articles