India got 8 place in asian games for getting more medals

asian games, incheon asian games, indian sports persons, india medals in asian games, indian sports persons in asian games, india kabaddi team, india got 8 rank in asian games, india medals

india got 8 place in asian games for getting more medals

ఆసియా క్రీడల్లో భారత్‌కు తీవ్ర నిరాశ! మరింత దిగజారిపోయింది!

Posted: 10/03/2014 07:08 PM IST
India got 8 place in asian games for getting more medals

17వ ఆసియా క్రీడలు ఇంకా ప్రారంభం కాకముందు మన భారతీయ క్రీడాకారులు అలా ఆడుతాం, ఇన్ని పతకాలు గెలుచుకుని వస్తామని కేవలం డప్పులు వాయించుకోవడమే సరిపోయిందే తప్ప.. చేతల్లో మాత్రం ఏం చేయలేకపోయారని తెలిసిపోయింది. గతంలో పోల్చుకుంటే ఈసారి భారత్ పరిస్థితి మరింత దిగజారిపోయిందని లెక్కలు తేల్చేశాయి. ఆసియా క్రీడలమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ క్రీడాభిమానులకు చివరకు నిరాశే మిగిలింది. మనోళ్లు ఏదో చేస్తారు.. చాలా తెస్తారు అనుకుంటే.. చివరికి ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకొస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పోరాటం కబడ్డీ ఆటతో ముగిసింది. ఆఖరి రోజున కబడ్డీ ఈవెంట్‌లో పురుషులు, మహిళల జట్లు తమతమ ప్రతిభలు చాటుకుంటూ స్వర్ణపతకాలు సాధించడంతో మన దేశం టాప్ 10లో స్థానం సంపాదించగలిగింది (లేకపోతే మరోలా వుండేది). ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే.. ఏడోసారి ఆసియా క్రీడల్లో పరుషుల కబడ్డీ జట్టు పసిడి పతకం గెలుచుకుని సరికొత్త సంచలనాన్ని సృష్టించారు. అయితేనేం.. మొత్తంగా చూస్తే ఆసియా క్రీడలు బారత్‌కు పెద్ద నిరాశనే మిగిల్చాయనే చెప్పాలి. ఈసారి క్రీడల్లో భారత్ మొత్తం కేవలం 11 స్వర్ణాలు, 9 రజతాలు, 37 కాంస్యాలను మాత్రమే సంపాదించుకోగలిగింది.

అదే 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ఆరో స్థానాన్ని సాధించింది. అప్పట్లో మనదేశం 14 స్వర్ణాలు, 17 రజతాలు, 31 కాంస్యాలు గెలుచుకుని 6వ స్థానంతో కాస్త గౌరవాన్ని దక్కించుకుంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి భారత్ స్థానం మరింత మెరుగుపడుతుందని ఈ గేమ్స్ ప్రారంభానికి ముందు క్రీడాభిమానులు ఎంతగానో అశించారు. అయితే, అందుకు విరుధ్దంగా రెండు స్థానాలు దిగజారడంతో క్రీడాలోకాన్ని నిరాశపరిచింది. ఇది నిజంగానే ఇండియాకు చాలా సిగ్గుచేటంటూ కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games  india sports persons  indian asian medals  

Other Articles