Two more gold medals into indian account

hockey, Asian Games, India vs Pakistan, hockey final, Sardar Singh, Rupinder Singh, women's relay team, game record, Laishram Sarita, wrestling,

India beat Pakistan to win gold medal, qualify for Rio Olympics, women's relay team creates game record

భారత్ ఖాతాలోకి మరో రెండు స్వర్ణాలు

Posted: 10/02/2014 08:12 PM IST
Two more gold medals into indian account

17వ ఆసియా క్రీడల్లో భాగంగా 13వ రోజు భారత్ తన ఖాతాలో రెండు స్వర్ణ పతకాలను జమచేసుకుంది. 14 ఏళ్ల తరువాత దాయాది దేశం పాకిస్థాన్ తో జరిగిన హాకీ ఫైన్సల్ ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం సాధించి పసిడిని పండించింది. నువ్వా నేనా అన్నట్టు జరిగిన పోరులో నిర్ణీత సమయానికి భారత, పాక్ జట్లు 1-1 గోల్స్ చేశాయి. దాంతో ఫలితం పెనాల్టీ షూటవుట్ కి చేరింది.
 
పెనాల్టీ షూటవుట్ లో భారత హాకీ క్రీడాకారులు సత్తా చాటి.. పాకిస్థాన్ ను కంగు తినిపించారు. షూటవుట్ లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించింది. భారత హాకీ జట్టు విజయంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో 8 స్వర్ణాలు చేరాయి. 1982 తర్వాత భారత, హాకీ జట్లు ఆసియా క్రీడల పోటీల్లో తలపడటం ఇదే తొలిసారి. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఈ విజయంతో ఓ వైపు స్వర్ణాన్ని దక్కించుకున్న భారత్.. అటు 2016లో రియోలో జరిగే ఒలంపిక్స్ క్రీడలకు అర్హత కూడా సాధించింది. 1998 అంటే సుమారుగా దశాబ్దమున్నర కాలం తరువాత భారత్ పురుషుల హాకీ జట్టు తన సత్తాను చాటి.. భారత్ ఖాతాలో స్వర్ణాన్ని వేసింది.

అటు మహిళల అథ్లెటిక్స్ విభాగంలోనూ భారత జట్టు తన ప్రతిభను కనబర్చి మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మహిళలు 400*4 పరుగు పందెంలో మహిళల జట్టు మరో పసిడి పతకాన్ని సాధించారు. జట్టులోని ప్రియాంక పవర్, టింకు లుక్కా, మన్ దీప్ కౌర్, పువమ్మారాజులు కొత్త రికార్డును సృష్టించారు. కేవలం మూడు నిమిషాల 28 సెకన్ల 68 గడియల్లో పరుగును ముగించి స్వర్ణం సాధించారు. అటు బాక్సింగ్ పురుషుల విభాగంలో భారత క్రీడాకారుడు సతీస్ కుమార్ కూడా అన్యాయం జరిగిందని జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. బాక్సర్ సరితా దేవి మాదిరిగానే సతీష్ కుమార్ కూడా గెలిచినా.. ఓడినట్లు నిర్ధారించారని కథనాలు ప్రచురించింది. సెమీస్ లో ఓడిన సతీస్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు మహిళల బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుని పతకాన్ని తీసుకునేందకు తిరస్కరించిన బాక్సర్ సరితాదేవి అంశం ఆసియా ఒలంపిక్స్ మండలి దృష్టికి చేరింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles