His negligence costs 12 lives

train accident, Gorakhpur, Barauni Express, Krishak Express, 12 fear dead, 45 injured, strict action, driver, sadananda gowda

Two trains collide near Gorakhpur; 14 killed, 45 injured, driver suspended

వారి నిర్లక్ష్యం ఖరీదు.. 14 మంది ప్రాణాలు..!

Posted: 10/01/2014 11:39 AM IST
His negligence costs 12 lives

వారు డ్రైవర్లు. వారి నిర్లక్ష్యం ఖరీదు 14 మంది ప్రాణాలు. ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలను తమ గుప్పిట్లో పెట్టుకుని.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆ డ్రైవర్లు. వారు రైలు లోకో పైలట్. అంటే రైలు డ్రైవర్లు. సిగ్నలింగ్ వ్యవస్థపై ఆధారపడి నడుస్తున్న రైళ్లను.. రైలు డ్రైవర్లే అధిగమించడం క్షమించరాని నేరం. వారి విధులనే వారు పట్టించుకోలేదనే అర్థం. ఎంతో మంది రైలు ప్రయాణికుల ప్రాణాలు తమ చేతిలో వున్నాయని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారన్నది అర్థం కాని ప్రశ్న. ఇందుకు ఫలితంగా ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో గత అర్థరాత్రి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీ కొన్నాయి.

ఈ ప్రమాదంలో సంఘటనాస్థలంలోనే పన్నెండు మంది మరణించారు. మరో 45 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బోగిల మధ్య  చిక్కుకుని మరో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి, సిగ్నల్ దాటి వెళ్లి అదే ట్రాక్పై వస్తున్న బరౌనీ ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టాడు. దీంతో బరౌనీ ఎక్స్ప్రెస్కు చెందిన అయిదు జనరల్ బోగీలు పట్టాలు తప్పగా... క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలులోని పలు కోచ్లు దెబ్బతిన్నాయి. కాగా క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైల్ డ్రైవర్లు ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారాన్ని ప్రకటించిన ఆయన, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలను, క్షతగాత్రులకు 20 వేల రూపాయలను నష్టపరిహారంగా అందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు రైలు డ్రైవర్లదే పూర్తి బాధ్యతని,  వారు సిగ్నల్ వ్యవస్థను పట్టించుకోకుండా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. రైలు డ్రైవర్లపై సస్పెన్షన్ వేటు వేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సదానంద గౌడ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles