Telangana government to issue new ration cards

ghmc, Comprehensive household survey, Greater population Telangana Government, schemes, Ration cards.

Telangana Government to issue New Ration cards, based on survey results

ప్రభుత్వ పథకాలకు సర్వేతో మెలిక..!

Posted: 09/30/2014 06:24 PM IST
Telangana government to issue new ration cards

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్టులను జారీ చేయనుంది. ఆగస్టు మాసంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ఆధారంగా రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని స్వయంగా తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాట్లాడారు. నవంబర్ నెల నుంచి లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. రేషన్ కార్డులు, పౌరసరఫరా, ఫించన్లపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలా, ప్రస్తుతం వున్న 20 కేజీల వ్యక్తిగత కోటాను 30 కేజీలకు పెంచాలా అనే దానిపై కూడా చర్చించినట్టు తెలిపారు. దీనిపై ఈ నెలాఖరుకల్లా సీఎంకు నివేదిక అందజేస్తామని ఈటెల చెప్పారు.

ఇంతవరకు సరిగానే వున్నా.. ప్రజలకు పథకాలను అందించేందుకు కేవలం ఆగస్టు 19 నిర్వహించిన సమగ్ర సర్వేనే ప్రామాణికంగా తీసుకోవడంతో తాము పథకాలను నష్టపోతామని పలువురు తెలంగాణ వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు జిల్లాల నుంచి వలసవచ్చి జీవనాన్ని సాగిస్తున్న వారు ప్రభుత్వ పథకాలకు తమకందవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమగ్ర సర్వేతో రాష్ట్రంలో ప్రజానికం ఎంత.?  కుటుంబాల సంఖ్య ఎంత ?  అన్న విషయాలను తెలుసుకున్న తెలంగాణ సర్కార్.. వారికి మాత్రమే పథకాలను వర్తింపజేయాలనుకోవడం సమంజసం కాదని విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వం తమ సర్వేలో ఎవరెవరు వున్నారన్న విషయాన్ని తెలుపుతూ జాబితాను విడుదల చేసివుంటే బాగుండేదని ప్రజలు కోరుతున్నారు. తమ వివరాలు సర్వేలో వున్నాయో..? లేదో..? నన్న అందోళన కూడా ప్రజల్లో నెలకోంది.

ఆగస్టు 19న తమ ఇళ్లకు అసలు సర్వే నిర్వహించచిన ఎన్యూమరేటర్లు రాలేదని ప్రజలు ఇప్పటికీ పిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజల నుంచి ఈ తరహా పిర్యాదులు అనేకం వెల్లువెత్తుతున్నాయి.  ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మరోమారు సమగ్ర సర్వే నిర్వహిస్తామని అప్పట్లో ప్రభుత్వ అధికారులు ప్రకటించినా.. ఇప్పడు ఆ ఊసే లేదు. పైపెచ్చు నవంబర్ నుంచి పథకాలను వర్తింపజేస్తామని ప్రభుత్వవర్గాలు ప్రకటిస్తుండడంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన నెలకొంది.

ఇక మరికొందరు ప్రజలు సర్వే నిర్వహించిన అధికారులకు తాము వివరాలను అందించామని స్పష్టం చేస్తూనే.. ఎన్యూమరేట్లరపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ వివరాలతో పాటు అనేక మంది వివరాలను సేకరించిన ఎన్యూమరేటర్లు వాటిని సరిగ్గా భద్రపర్చి.. ఉన్నతాధికారులు అందజేశారా..? లేదా..? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సర్వేలో వున్న కుటుంబాల పేర్లు, మనుషుల పేర్లతో జాబితాను సిద్దం చేసి ప్రజలకు అయా ప్రాంతాల వారీగా అందజేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

ఎన్యూమరేటర్లు, కంప్యూటర్లలో డాటాను నిక్షిప్తం చేసే అధికారులు తప్పిదాల వల్ల తమ పేర్లు జాబితాలో మిస్ అయ్యే ప్రజలు ఏం చేయాలన్నది ప్రభుత్వమే చెబితే బాగుంటుంది. హడావిడాగా నవంబర్ నుంచి అన్ని పథకాలను అమలుకు శ్రీకారం చుడుతామని చెబుతున్న ప్రభుత్వం.. దీనిపై కూడా దృష్టి సారిస్తే మంచిదని ప్రజలు కోరుతున్నారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles