Companies announce new festive season offers

ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు వచ్చేశాయ్..

Posted: 09/27/2014 10:20 AM IST
Companies announce new festive season offers

దసరా, దీపావళి సీజన్ వచ్చేసింది. అదేంటి సీజన్ అంటారు అనుకుంటున్నారా..? ఇది బడా షాపింగ్ మాల్స్ కు, కస్టమర్లకు సీజనే కాబట్టి. ఈ పండుగ నుంచి ప్రారంభమయ్యే సీజన్ సంక్రాంతి, ఉగాది వరకు కొనసాగుతుంది. ఈ పండుగ సీజన్ ఎప్పడు వస్తుందా.. ఎప్పడెప్పుడు కోత్త ఆపర్ల వస్తాయా అంటూ కస్టమర్లు ఎదురుచూస్తుంటే.. పండగ సీజన్ లో బోనస్ వ్యాపారాలను కొనసాగించాలని పలు వ్యాపార సంస్థలు ఎదురు చూస్తుంటాయి. దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయో.. లేదో.. అప్పడే బిగ్ సి తో పాటు టీఎంసీ సంస్థ కూడా పండుగ ఆఫర్లను తీసుకోచ్చింది. ఇక వస్త్ర, వ్యాపార సంస్థలు కూడా పండగ సీజన్లో మార్కట్ తో పోటీ పడుతూ ఆపర్లను తీసుకువస్తున్నాయి.

మొబైల్ విక్రయాల్లో అతిపెద్ద సంస్థ బిగ్ సి దసరా, దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని దసరావళి పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో ఒకటి కొంటే ఒకటి, ఒకటి కొంటే రెండు, ఒకటి కొంటే మూడు, ఒకటి కొంటే నాలుగు మొబైళ్లతో పాటు ఎంపిక చేసిన పలు మోడళ్లపై ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి తెలిపారు. మైక్రోమాక్స్ ఏ37బీ కొనుగోలుపై 50 శాతం , ఐఫోన్ 5ఎస్‌పై 25శాతం డిస్కౌంట్ ఇవ్వనుండగా, రూ.8,999 విలువైన మైక్రోమాక్స్ ఏ177 కొనుగోలుపై రూ.4 వేల విలువైన నాలుగు ఫీచర్ ఫోన్లు ఉచితంగా అందచేయన్నారు.

రూ.4,999 ధర కలిగిన కార్బన్ కే85పై రూ.3 వేల విలువైన మూడు మొబైళ్లను ఫ్రీగా ఇవ్వనున్నది. దీంతోపాటు నోకియా లూమియా 630పై రూ.5 వేల విలువగల హెచ్‌సీఎల్ ట్యాబ్‌ను ఉచితంగా అందిస్తున్నది. రూ.1,999 విలువైన సెల్‌కాన్ సీ4040 టచ్‌ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.వెయ్యి ఫోన్‌ను ఉచితంగా ఇవ్వనుండగా, రూ.7,999 ధర కలిగిన సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్‌పై రూ.2 వేల విలువైన రెండు ఫోన్లను అందిస్తున్నది. సోనీ ఈ3ని కొనుగోలు చేసిన వారికి వెయ్యి రూపాయల విలువగల పవర్ బ్యాంక్‌ను, నోకియా ఎక్స్‌ఎల్‌పై రూ.499 విలువైన ఫిలిప్స్ హెడ్‌సెట్‌ను ఉచితంగా అందచేస్తున్నట్లు తెలిపింది.

అటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రిటైల్ విక్రయ సంస్థ టీఎంసీ.. వెల్ సెటిల్డ్ ఫర్ లైఫ్ విత్ టీఎంసీ పేరుతో దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. దసరా లక్కీ డ్రాలో రూ.5,12,500 విలువైన హోండా అమేజ్ కారు, దీపావళి డ్రాలో రూ.25 లక్షల నగదు, బంపర్ డ్రాలో రూ.45 లక్షల విలువైన డూప్లెక్స్ విల్లాను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. రూ.1000 కొనుగోలు చేసిన వారు ఈ మూడు ఆఫర్లను పొందేందుకు అర్హులని వెల్లడించింది. వచ్చేనెల 9లోగా బజాజ్ ఫైనాన్స్ సదుపాయంపై కొనుగోలు చేసిన వారికి డ్రాలో ఒక్కొక్కటి రూ.3 లక్షల విలువ చేసే రెండు వడ్డాణాలను గెల్చుకునే అవకాశం ఉంటుందని సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇటు వస్త్ర వ్యాపార రంగంలో పెరొందిన సంస్థలు కూడా తమ పండుగ ఆపర్లను ప్రకటించాయ్.. భారీ డిస్కంట్ లను అందిస్తున్నాయి. పలు సంస్థలు బంపర్ డ్రాలతో కస్లమర్లను ఆకర్షిస్తుండగా, పలు సంస్థలు రోజుకో బహుమతి పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఆఫర్ల సీజన్ కస్టమర్లకు భలే  కలిసోస్తుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles