Western countries creates another controversy by creating barbie doll as goddess kalimata

barbie dolls kalimata, kalimata barbie dolls, western country cultures, indian cultures, goddess dolls controvercies, indo american officials, goddess kalimata, barbie dolls

western countries creates another controversy by creating barbie doll as goddess kalimata

పాశ్చాత్య దేశాల పిచ్చి పైత్యం.. కాళీమాత బొమ్మలు!

Posted: 09/26/2014 09:06 PM IST
Western countries creates another controversy by creating barbie doll as goddess kalimata

‘‘ఎదుటివాడు ఎలా పోతోనేం.. మేం బాగుంటే చాలు’’ అనే సూత్రాన్ని పాశ్చాత్య దేశాలు బాగానే ఒంటబెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎదుటివారి మనోభావాలకు ఏమాత్రం విలువనివ్వకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. మన హిందూ దేవతలను అనుకరించి పాశ్చాత్య దేశాలు ఇప్పటికే ఎన్నో వివాదాలకు తెరలేపాయి. హిందువుల మనోభావాలు కించపరిచేలా దేవతల బొమ్మలను విడుదల చేస్తుంటారు. అటువంటి వ్యవహారాలపై ఫిర్యాదు చేసినప్పటికీ.. వాళ్లు మాత్రం తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఇలా ఎన్నోసార్లు పాశ్చాత్త దేశాలు వ్యవహరించాయి. ఇప్పుడు తాజాగా వారి పైత్యం మరోసారి తెరమీదకు వచ్చింది.

సాధారణంగా బార్బీ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా బాగానే పేరుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వాటిని కొనుగోలు చేయడంలో ఎంతో ఆసక్తి కనబరుస్తారు. దీంతో వాటి తయారీదారులు రకరకాల రూపాల్లో వాటిని మలిచి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో అప్పుడప్పుడు విడుదల చేస్తుంటారు. అయితే ఈసారి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అర్జెంటీనాకు చెందిన మారియానెలా పెరెల్లీ, పూల్ పావోలిని అనే కళాకారులు బార్బీ బొమ్మలను కాళీమాత రూపంలో, ఇతర మతాలకు చెందిన దేవతల రూపాల్లో డిజైన్ చేసి విడుదల చేశారు. ఆ బొమ్మలకు ‘‘బార్బీ ద ప్లాస్టిక్ రెలిజియన్’’ అనే పేరు పెట్టి మార్కెట్ లోకి విడుదల చేశారు. దీంతో ఇది పెద్ద దుమారంగా మారిపోయింది. కేవలం మన ఇండియాలోనే కాదు.. ఈ బార్బీ బొమ్మలపై ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. వివిధ మతాలకు చెందిన ప్రముఖులు వీటి తయారీదారులపై విరుచుకుపడుతున్నారు.

అయితే ఈ విషయంపై ఇండో-అమెరికన్ స్పందిస్తూ.. హిందూమతాన్ని ప్రతిబింబించే కళారూపాలను తాము స్వాగతిస్తున్నామని.. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం హిందుత్వ సిద్ధాంతాలు, ప్రతీకల రూపురేఖలకు మార్చేందుకు ప్రయత్నించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. అలా అయితే.. మరి ఇటువంటి ఎందుకు ప్రతీసారి తెరమీదకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇలా ఎన్నోసార్లు వివాదాలు తెరమీదకు వచ్చినప్పటికీ.. వాటి మీద యాక్షన్ తీసుకోవడం కాదు కదా... ఫిర్యాదు చేసిన వారినే సంజాయిషీ ఇచ్చి వెనక్కు పంపిస్తున్నారు. నిజానికి ఏ మతానికి చెందిన వారైనా.. ఇటువంటి వ్యవహారాల్లో వారి మనోభావాలు దెబ్బతినడం ఖాయం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోనైనా తయారీదారులు ఇకనుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barbie dolls  goddess kalimata  barbie dolls kalimata  western countries  indian culture  

Other Articles