భారత అంతరిక్ష పరిశోధనలో చారిత్రకఘట్టం చోటు చేసుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అంగారకుడిపై పరిశోధన కోసం భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)పై నెలకొన్న ఉత్కంఠకు తెర వీడింది. అరుణ గ్రహ కక్ష్యలోకి మామ్ ప్రవేశించే సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఉద్వేగానికి లోనయ్యారు. అంగారక గ్రహంపై మామ్ ల్యాండింగ్ విజయవంతం కావాలని భారతీయులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. మునుపెన్నడూ ఏ ప్రయోగానికి లేనంత ఉత్కంఠ మంగళ్ యాన్ విషయంలో నెలకొనడం.. అది సక్సెస్ కావడంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ చరిత్ర సృష్టించింది. అరుణగ్రహంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
మంగళ్ యాన్ ప్రయోగాన్ని బెంగళూరులోని ఇస్ట్రాక్ ప్రాంగణంలో పరిశీలించిన ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సహా శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. మామ్ ప్రయోగాన్ని వీక్షించేందుకు బెంగళూరు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రయోగం విజయవంతంతో ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు తెలిపారు. మంగళ్ యాన్ విజయవంత కావడం పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన దేశాల జాబితాలో భారత్ నాలుగో దేశంగా నిలిచింది.
సోమవారం నిర్వహించిన సన్నాహక కీలక విన్యాసం సాఫీగా సాగిపోయినప్పటి నుంచి మంగళ్ యాన్ పై త్రీవ్ర ఉత్కంఠ నెలకొనింది. ఉపగ్రహంలో 10 నెలలుగా నిద్రాణంగా ఉన్న ద్రవ అపోగీ మోటార్ (లామ్) దిగ్విజయంగా పనిచేసింది. ఫలితంగా కక్ష్యలోకి ఈ ఉపగ్రహ ప్రవేశంపై విశ్వాసం మరింత పెరిగింది. లామ్‌ను ప్రయోగాత్మకంగా మండించే కార్యక్రమం విజయవంతంగా పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టి తుది అంకంవైపు మళ్లింది. ఉదయం 7.17గంటలకు లామ్‌ను 24 నిమిషాల పాటు మండించి, ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్లకు శాస్త్రవేత్తలు తగ్గించారు. ఆ తరువాత ఉపగ్రహాన్ని భారత్ వైపు మళ్లించారు. అనంతరం అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12.30: ఉపగ్రహం నుంచి తొలిచిత్రం ఇస్రో శాస్త్రవేత్తలు అందుకోనున్నారు. సంబంధించి ఉత్కంఠ పెరిగింది. అంగారకుడిపై జీవం ఉనికికి సంబంధించి ఈ ఉపగ్రహం పరిశోధనలు సాగించనుంది.
ఇప్పటి వరకూ అరుణగ్రహంపైకి ఉపగ్రహాలను పంపే ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా 51 జరుగగా అందులో 21 మాత్రమే విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో మామ్‌కు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం పట్ల దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. మంగళ్ యాన్ ఫ్రయోగంతో ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తిరుగు లేని దేశంగా మరోసారి ప్రపంచానికి చాటింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more