Mother forced her daughter to have sex with 2 thousand members at the age of 18

jacqueline marling, mother forced daughter for gang rape, jacqueline marling arrest, jacqueline marling daughter

mother forced her daughter to have sex with 2 thousand members at the age of 18

కన్నకూతుర్నే 2వేల మందితో గ్యాంగ్ రేప్ చేయించిన తల్లి!

Posted: 09/23/2014 09:18 PM IST
Mother forced her daughter to have sex with 2 thousand members at the age of 18

(Image source from: mother forced her daughter to have sex with 2 thousand members at the age of 18)

సమాజంలో ఇన్నాళ్లవరకు కేవలం మానవత్వమే అనుకున్నాం... కానీ ఈ తాజా ఘటనను చూస్తుంటే మాతృత్వం కూడా పరాకాష్టకు చేరిందని తాజా సంఘటన తెలుపుతోంది. 18 ఏళ్ల వయస్సులో వున్న తన కన్నకూతుర్నే దాదాపు 2000 మంది పక్కన పడుకోబెట్టి.. తల్లి అనే పదానికే అర్థం లేకుండా చేసింది. జాక్వెలిన్ మార్లింగ్ అయిన ఆమె.. తన భర్తతో కలిసి మరీ ఇంత దారుణానికి ఒడికట్టింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ తల్లి.. తన కూతురితో ప్రతిరోజూ వ్యభిచారం చేయిస్తూ డబ్బులు పొగేసుకునే ఆమెఇప్పుడు కటకటాలవెనుక నరకాన్ని అనుభవిస్తోంది. ఎన్నో అరాచకాలకు బలైన ఆ అమ్మాయి.. తనతో జరిగిన ఈ దారుణాలను దాదాపు 30 ఏళ్ల తరువాత ప్రపంచానికి వెల్లడించింది.

తల్లి, పెంపుడు తండ్రి మధ్య బంధీలా చిక్కుపోయిన ఆమె.. తనపై జరిగిన అత్యాచారాల గురించి వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఏడేళ్ల వయస్సులోనే తల్లి తనపై అత్యాచారం చేయించిందని ఆమె పేర్కొంది. అలాగే 11 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని వెల్లడించింది. మరో మూడేళ్ల తర్వాత వేల్స్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులతో కలిసి సామూహిక సెక్స్ లో పాల్గొనాల్సిందిగా తన తల్లి బెదిరించిందని, అందులో తన తల్లి కూడా పాల్గొందని తెలిపింది. తన తల్లి చేయిస్తున్న ఈ అరాచకపు పనులను భరించలేక 14 ఏళ్ల వయస్సులో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని.. అయితే దురదృష్టవశాత్తూ బతికి బట్టకట్టానని చెప్పింది.

తాను 17 ఏళ్ల వయస్సులో వున్నప్పుడు సవతి తండ్రి తనను గర్భవతి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన 18వ పుట్టినరోజు జరుపుకునేసరికి దాదాపు 2వేల మంది తనపై అత్యాచారం జరిపారని ఆమె బాధను వెళ్లగక్కుకుంది. పగటి సమయంలో స్కూలుకు వెళ్లే అమ్మాయిగా కనిపించిన తాను.. రాత్రిపూట సెక్స్ బానిసగా రోజులు వెళ్లదీశానని తెలిపింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన తన తల్లిని తాను ఎప్పటికీ క్షమించనని.. తన తల్లికంటే మరెవ్వరూ తనను బాధ పెట్టలేదని బాధితురాలు మొర పెట్టుకుంది. ఆమెను కఠినంగా శిక్షించాలంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె సొంతం కుటుంబంతో స్థిరపడటంతో అన్ని విషయాలనూ ధైర్యంగా చెప్పింది. ఆమె తల్లిదండ్రులకు 11, 12 ఏళ్ల జైలు శిక్షలు విధించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jacqueline marling  gang rape  jacqueline marling daughter  

Other Articles