Chidambaram involvement in aircel maxis case

chidambaram, case on chidambaram, chidambaram wiki, chidambaram family, chidambaram son name, karthi, karthi chidambaram, chidambaram in aircel case, aircel maxis case, cbi, cbi court, cbi on chidambaram, karthi cases, latest news, upa, scams, upa scams

cbi says to special court about aircel maxis case that former finance minister chidambaram made mistake and taken wrong decissions : chidambaram has permit to authorise companies worth rs 600 crores only but in aircel case he given permission to rs 3,500 crores

కార్తికోసం తప్పు చేసిన కన్నతండ్రి

Posted: 09/23/2014 08:31 AM IST
Chidambaram involvement in aircel maxis case

మాజి కేంద్రమంత్రి చిదంబరంకు కొడుకు కష్టాలు ఇంకా తీరటంలేదు. ఆయన కొడుకు నడుపుతున్న ఎయిర్ సెల్ కంపనీ కేటాయింపులు, అనుమతులపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీబీఐ చిదంబరం తప్పు చేశారని కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో పరిమితిని దాటి వ్యవహరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సోమవారం జరిగిన విచారణలో ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను కోర్టుకు తెలిపింది. యూపీఏ హయంలో ఆర్ధికమంత్రి హోదాలో చిదంబరం రూ.3,500 కోట్ల ఒప్పందానికి అనువుతిచ్చే అధికారం ఆయనకు లేదని తెలిపింది.

విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకబోర్డు (ఎఫ్‌ఐపీబీ) తో మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించే అధికారం చిదంబరానికి లేదని స్పష్టం చేసింది. ఆర్థిక వుంత్రిగా కేవలం రూ. 600 కోట్ల విలువైన ఒప్పందాలను మాత్రమే అనువుతించే అధికారం ఉంటుందని అంతకంటే ఎక్కువ విలువైన ఒప్పందాలు ఆర్థికవ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కు ఉంటుందని కోర్టుకు తెలిపింది. చిదంబరం పరిమితిని దాటి అక్రమంగా కార్తి కోసం ఏకంగా రూ.3,500 కోట్ల ఒప్పందాన్ని అనుమతించారని వెల్లడించింది. సీబీఐ ఆరోపణలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
 
యూపీఏ వరుస కుంభకోణాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. విదేశాల నుంచి అక్రమంగా నిధులు తీసుకువచ్చారంటూ ఈ కంపనీ ఒప్పందాలపై ఆరోపణలు వచ్చాయి. ఎయిర్ సెల్ వ్యవహారాలను చిదంబరం కుమారుడు కార్తి చూస్తుండటంతో ప్రభుత్వంపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో సీబీఐ విచారణ జరుగుతోంది. ఇదే కేసులో మాజి టెలికం మంత్రి దయూనిధి వూరన్, సోదరుడు కళానిధి వూరన్, సన్ డెరైక్ట్ టీవీ, సౌత్ ఆసియూ ఎంటర్‌టైన్‌మెంట్ హోల్డింగ్, మ్యాక్సిస్ కమ్యూనికేషన్, ఆస్ట్రాల్ ఆసియూ నెట్‌వర్క్ సంస్థలతోపాటు పలువురు ప్రముఖులను నిందితులుగా సీబీఐ చేర్చింది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chidambaram  karthi  aircel maxis  latest news  

Other Articles