Ysrcp mla srikanth reddy takes on lokesh tdp government

lokesh, chandrababu naidu, srikanth reddy, yscrp, rtc, tdp government, non-constitutional power

ysrcp mla srikanth reddy takes on lokesh, alleges he is a non-constitutional power

ముఖ్యమంత్రి కుమారుడా..? రాజ్యాంగేతర శక్తా..?

Posted: 09/22/2014 03:44 PM IST
Ysrcp mla srikanth reddy takes on lokesh tdp government

ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్.. రాజ్యాంగేతర శక్తా..? ఇంత ఘాటుగా విమర్శించే స్థాయికి వైసీపీ ఎందుకు ఒడిగట్టింది. అసలు ఇంతకీ ఆయన చేసిన నేరమేంటి..? లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇటీవలే పార్టీ ఎఫైర్స్ ఇన్ఛార్జ్గా లోకేష్ ను చంద్రబాబు నియమించడమేనా..? ఇదే వారికి రుచించడం లేదా..? అయినా వీరు టీడీపీ నేతలు కాదుకదా..? రాజ్యాంగ పరంగా జోక్యం చేసుకోని వ్యక్తిని రాజ్యాంగేతర శక్తి అని అభివర్ణించడం సమంజసమేనా..? అయితే పనిలో పనిగా చంద్రబాబును కూడా శ్రీకాంత్ కడిగేశారు.  ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నష్టాలను బూచిగా చూపి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అర్టీసీ, జెన్కోలను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

రాస్ట్ర వ్యాప్తంగా 84 ప్రభుత్వరంగ సంస్థలు మూతపడితే వాటిలో 54 చంద్రబాబు హయాంలోనే మూతపడ్డాయని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తనవారికి కట్టబెట్టేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తారన్నారు. పాలేరు షుగర్స్‌ను చంద్రబాబు మధుకాన్‌ సంస్థకు కారుచౌకగా కట్టబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వపరంగా సంస్థలను పచ్చ చొక్కాలను అప్పజెప్పారన్నారు. మళ్లీ ఇప్పుడు అదే పంథా కొనసాగుతోందన్నారు.

ఇందులో భాగంగానే జీఓ నెంబర్ 289,290 పేరుతో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పందికొక్కుల్లా దోచుకు తింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు. ప్రైవేటీకరణను  గొప్పగా చెప్పుకోవటం దారుణమన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lokesh  chandrababu naidu  srikanth reddy  yscrp  rtc  

Other Articles