Student slaps teacher in tamilnadu

students, misbehaviour, students behaviour, students misbehaviour, latest news, student slaps teacher, indian teachers, telugu teachers, tamilnadu, schools, students war

a student slaps teacher in tamilnadu for objecting his misbehaviour with another student : in tamilnadu a student misbehavious with another student teacher records this in mobile angered student slaps teacher

తప్పు అని చెప్తే టీచర్ చెంప చెల్లుమంది

Posted: 09/21/2014 07:34 AM IST
Student slaps teacher in tamilnadu

ఒకప్పుడు టీచర్లు అంటే విద్యార్థులకు ఎంతో గౌరవం ఉండేది. రానురాను అది తగ్గిపోతుంది. టీచర్లు విద్యార్థులతో స్నేహంగా మెలగటంతో వారు కూడా స్నేహితుల్లా ఫీల్ అయ్యే రేంజ్ కు వచ్చారు. మంచిమాటల కంటే మార్కులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో విద్యార్థుల్లో నైతిక విలువలు పడిపోతున్నాయి. అది ఏ స్థాయిలో అంటే చదువు చెప్పే గురువును బ్లాక్ మెయల్ చేసేలా.. చెంప దెబ్బలు కొట్టేలా. తమిళనాడులో ఓ విద్యార్థి తన తప్పును ప్రశ్నించినందుకు టీచర్ ను చెంపదెబ్బ కొట్టాడు. ఘటనకు సంబంధించిన వివరాలు లా ఉన్ానయి. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి ప్రభుత్వ స్కూళ్లో.., టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించాడు. అదే సమయంలో తరగతిలో పాఠాలు చెబుతున్న టీచర్ వాడి

ప్రవర్తనను గమనించి భయపెట్టాలనే ఉద్దేశ్యంతో నిర్వాకాన్ని సెల్ లో వీడియో తీసింది. విషయం తెలిసిన విద్యార్థి తనకు సంబంధించిన వీడియో డిలీట్ చేయాలని కోరాడు. ఇద్దరిమద్య ఈ విషయమై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. గురువుకే ఎదురుచెప్తావా అంటూ టీచర్ విద్యార్థి చెంపపై కొట్టింది. అప్పటికే ఆమెపై కోపంతో ఊగిపోతున్న విలువలు లేని ఆ విద్యార్థి.., తిరిగి టీచర్ చెంప ఛెళ్ళుమనిపించాడు. దీంతో ఆమె నిర్ఘాంతపోయింది. తాను రోజు పాఠం చెప్తే నేర్చుకునే విద్యార్థి తనపైనే చేయి చేసుకునేలా దిగజారిపోవటాన్ని తట్టుకోలేకపోయింది. అయితే వాడి పొగరు అణిచివేయాలని ఆమె నిర్ణయించుకుంది.

విషయం స్కూల్ వర్గాలకు చెప్పగా.., వారు కూడా విద్యార్థి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి ఉపాధ్యాయుల మద్దతుతో విద్యార్థిపై టీచర్ చేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలిసులు.., విద్యార్ధిని విచారిస్తున్నారు. టీచర్ కొడితే నానా రభస చేసే విద్యార్థి సంఘాలు., ఇతర సంఘాల నేతలు ఎవరూ  ఈ అన్యాయాన్ని ప్రశ్నించటం లేదు. అదే టీచర్ కొడితే మాత్రం స్కూలు ముందు ధర్నాలు, దీక్షల టెంట్లు వెలిసి ఉండేవి. విద్యార్థులు తెలివిమీరిపోయారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  teacher  tamilnadu  latest news  

Other Articles