Will take back kashmir ppp

Bilawal bhutto, jammu kashmir, controversial comments, kashmir comments, pakistan

Will get back entire kashmir from india says bilawal bhutto, we wont leave even a inch

భారత్ లో అంగుళం కాశ్మీర్ కూడా ఉండనివ్వం, లాక్కుంటాం

Posted: 09/20/2014 06:59 PM IST
Will take back kashmir ppp

(Image source from: Will take back Kashmir PPP)

భారత్ లో అంగుళం కాశ్మీర్ ను కూడా వదలం.. మొత్తాన్ని లాక్కుంటామని దివంగత పాక్ నాయకురాలు బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మొత్తం కాశ్మీర్ను భారత్ నుంచి లాక్కుంటామని, అందుకు తమ పాకిస్థాన్ పీఫుల్స్ పార్టీ (పీపీపీ) కృషి చేస్తుందని వ్యాఖ్యానించాడు  పాకిస్థాన్ పంజాబ్లోని ముల్తాన్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అతనీ వ్యాఖ్యలు చేశాడు.  ''నేను మొత్తం కాశ్మీర్ను వెనక్కి తీసుకుంటా. అందులో ఒక్క అంగుళం కూడా వదలను. ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లాగే అది కూడా పాకిస్థాన్కే చెందుతుంది'' అని భుట్టో కుటుంబ వారసుడు ప్రగల్భాలకు పలికాడు.

బిలావల్ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో పాక్ మాజీ ప్రధానమంత్రులు యూసుఫ్ రజా గిలానీ, రజా పర్వేజ్ అషారఫ్ అతడికి ఇరువైపులా ఉన్నారు. 2018లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందే ప్రకటించిన బిలావల్.. అందుకోసం పాక్ ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. దేశానికి జరిగే ఎన్నికల్లో గెలిస్తే.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాల్సిన నేత.. ఇలా ప్రజలను రెచ్చగొట్టడంపై ఎంత వరకు సమంజసమని విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి.

దేశంలోని సమస్యను రాజకీయ పార్టీలు లేవనెత్తడం.. ఎన్నికల్లో గెలిస్తే వాటిని పరిష్కరించడం సహజంగా జరుగుతున్న ప్రక్రియే. అయితే కాశ్మీర్ అంశం వారి దేశానికి సంబంధించిన సమస్య కాదు. భారత్ పాక్ లకు సంబంధించిన అంశం. మొత్తం కాశ్మీర్ ను లాక్కుంటాంచ అంగుళం కూడా వదలమని బిలావల్ భుట్లో వ్యాఖ్యానించడం.. ఎంత వరకు సమంజసం. భారత్ తో యుద్దం చేసిన ప్రతీసారి ఓటమి చవిచూసిన పాకిస్థాన్.. ఎలా కాశ్మీర్ను లాక్కుంటుంది. బిలావల్ ఇంకా పరిపక్వత లేని నాయకుడని విపక్షాలు విమర్శలకు ఆయన ఏం బదులిస్తారు.

కాశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై మాట్లాడాలంటే.. అచితూచి మాట్లాడాలి. నోటకి ఎది వస్తే అది మాట్లాడేసి.. ప్రజలను రెచ్చగోట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే అది సహేతుకం కాదు. అసలు భారత్ నుంచి కాశ్మీర్ ను లాక్కోవడం అంత సులువైన పనా..? భారత్ శాంతి కామక దేశం కాబ్బట్లే.. పాకిస్థాన్ ప్రేరేమిత ఉగ్రవాదాన్ని అణిచివేస్తూ.. కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో రెండు పర్యాయాలు భారత్ తో కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్ కు తగిన బుద్ది చెప్పినా..ఇంకా మార్పు రావడం లేదు. భారత్ తో యుద్దం చేసి మనగలమా..? అన్న ప్రశ్నకు వారి సైన్యమే సమాధానం చెప్పాలి.

బిలావల్ భుట్టో వ్యాఖ్యాలపై ఇటు భారత్ వాసుల్లో పెద్ద ఎత్తున్న ఆగ్రహజ్వాలలు పెల్లుబిక్కాయి. ఎన్నికలలో గెలవడానికి ప్రజలను రెచ్చగోట్టే పనులు చేయడం కూడా తప్పే. ఇలాంటి వ్యాఖ్యలపై కూడా ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలి. ప్రజలను రెచ్చగోట్టినంత మాత్రన విజయం సాధించలేమని రాజకీయ పార్టీల నేతరు గుర్తుంచుకోవాలని భారతీయులు అంటున్నారు. మాకు గ్రేట్ బ్రిటన్ నుంచి విముక్తి కావాలని అక్కడి ప్రజలను రెచ్చగోట్టిన ప్రత్యేక వాదులకు.. వారు బుద్ది చెప్పి 24 గంటలు గడవక ముందే.. పాకిస్థాన్ లో బలావల్ భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగోట్టేందుకు ఒడిగట్టడంపై భారతీయులు మండిపడుతున్నారు.

తన తాత స్థాపించిన పార్టీ విజయం కోసం యుద్దానికి సిద్దమంటున్న బిలావల్ కు పాకిస్థాన్ ప్రజలు ఎలా మద్దతిస్తారు. యుద్దం అంటే రెండు అక్షరాలు కాదు.. దేశంలో ఒక రకమైన అనిశ్చితి. ఎం జరుగుతుందోనన్న అంధోళన ప్రజల్లో వుంటుంది. యుద్దం వల్ల దేశ ఆర్థక పరిస్థతి సన్నగిల్లుతుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆఃకాశానంటుతాయి. ప్రజాధనం వృధా అవుతుంది. ఇదంతా ప్రధాని అవ్వాలని ఆశపడుతున్న బిలావల్ భుట్టోకు తెలుసా..? తెలియకుండానే తమ పార్టీ కాశ్మీర్ ను లాక్కుటుందని, అంగుళం కాశ్మీర్ ను కూడా భారత్ లో వుండనివ్వమని ఎలా ప్రజలను రెచ్చగోడతాడు.

ఓట్లు పడాలంటే.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. కానీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదన్న విషయాన్ని పార్టీ పెద్దలు, సీనియర్లు బిలావల్ కు చెప్పాలి. తన తల్లి ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని చెప్పాలి. ఇమ్రాన్ ఖాన్ మాదిరిగా ప్రజా ఉద్యమాలకు పిలుపు నివ్వాలి. ప్రభుత్వమే తమ వద్దకు వచ్చేట్లు చేసుకోవాలి. అంతేకాని మరో దేశంతో యుద్దం చేస్తామని పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజకీయ అపరిపకత్వతకు నిదర్శనం. ఇప్పటికైనా బిలావల్ భుట్టో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bilawal bhutto  jammu kashmir  controversial comments  kashmir comments  pakistan  

Other Articles