Does god require man s protection

Maharashtra, devotees,State government, Sai Baba, Swami Swaroopanand Saraswati, Supreme Court, PIL

PIL filed in Supreme Court on controversy created on Sai Baba

దైవానికి మానవ రక్షణ అవసరమా..?

Posted: 09/18/2014 03:14 PM IST
Does god require man s protection

దైవం అంటే ప్రతీ రోజు మన మొక్కడానికి ఒక దైవం.. మన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, ఇలా అనేక నిర్వచనాలు చెబుతుంటాం. కాని నిజమైన దైవం ఎవరంటే మనిషే. మానవ సేవ మాధవ సేవ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటలను కూడా మనిషి లక్ష్యపెట్టకుండా తన తెలసీ తెలియకుండానే పరదూషణలకు పాల్పడుతున్నాడు. నలుగురు దరి చేరగానే.. అహం బ్రహస్మీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నాడు. సాటి మనుషులకు సాయం చేసే వాడే దేవుడు అన్న ఇంకితాన్ని మరచి.. సనాతన ధర్మాలు, దైవాలు అంటూ తనకు తానే గిరి గీసుకుంటూ.. అందులోంచి బయట పడలేకపోతున్నాడు.

నీ స్నేహితులకు చేతనైనంత సాయం చేయండి, అర్తులకు చేయగలింగింది చేయండి, వారి నుంచి ఏమీ అశించకండి.. మీకు అవసరం అయనప్పుడు మరో మనిషి మీకు సాయంగా వస్తాడు.. మిమ్మల్ని ఆదుకుంటాడు అంటూ ప్రచారం చేయాల్సిన స్వామీజిలు ఒకరు దేవుడు కాదు, మరోకరే దేవుడు అంటూ వివాదాలకు తెరలేపడం ఎంత వరకు సమంజసం. భక్తుల మనోభావాలతో ఆటలాడుకునే హక్కు స్వామీజీలకు ఎవరిచ్చారు. అసలు స్వామీజీలు ఎవరు? సనాతన ధర్మాలను కాపాడేందుకు ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో సంచరించే వారా..? పుణ్యక్షేత్రాలకు, పీఠాలకు మాత్రమే పరిమితమైయ్యేవారా..? వేదాలు అవపోసన పట్టినంత మాత్రాన వారు ప్రత్యేకతను సంతరించుకుంటారా..?. ఇప్పుడీ చర్చ ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. శంకారాచార్య స్వరూపానంద సరస్వతి.. షర్డీ సాయిబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో షిర్డీలోని సాయి పుణ్యక్షత్రంతో పాటు మహారాష్ట్రలోని అనేక షిరిడీ ఆలయాలను నిర్వహణ బాధ్యతలను చూసే సాయిధామ్ చారిటెబుట్ ట్రస్ట్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపును తట్టింది.

సాయిబాబా హిందువు కాదంటూ.. ఆయన అసలు దైవమే కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతితో పాటు ఆయన అనుచరుల నుంచి సాయి మందిరాలను రక్షించాలని కోరుతూ సాయిధామ్ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. షిర్డీ సాయిబాబాపై ఎవరూ కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ 'సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్' సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు బాబాపై ఎలాంటి ప్రకటనలూ చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో ఎక్కడా ఏ ఆలయంలోంచీ వారు బాబా ప్రతిమలను తొలగించకుండా చూడాలని కోరింది. బాబాకు వ్యతిరేకంగా స్వామి స్వరూపానంద సరస్వతి, ఆయన అనుచరులు కించపరిచే, అవమానకర పదజాలం వాడారని, వారి వ్యాఖ్యలతో దేశ, విదేశాల్లో ఉన్న కోట్ల మంది బాబా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోలేదని తప్పుబట్టింది. షిర్డీ సాయిని కించపరుస్తూ.. అవమానకర పదజాలంతో ధూషించే వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

స్వరూపానంద వ్యాఖ్యల నేపథ్యంలో అనేక ప్రశ్నలు భక్తుల మదిని తొలుస్తున్నాయి. శతాబ్దాలుగా హిందువులు పూజిస్తున్న షిరిడీ సాయి.. హిందువు కాకపోతేనేం.. గురువుగా భావించలేమా.. అంటున్నారు. మాంసాన్ని తినే సాయి గురువు ఎలా అవుతాడన్న స్వరూపానంద సరస్వతికి.. భక్త కన్నప్ప భక్తితో పెట్టిన మాంస ప్రసాదాన్ని మహాశివుడు స్వీకరించలేదా.. అంటూ సాయి భక్తులు సమాధానమిస్తున్నారు. అల్లాను పూజించే సాయి.. సభ్ కా మాలిక్ ఏక్ అంటూ అన్ని మతాలవారు సహృద్భావంతో వుండాలని చాటారే తప్ప, అందరూ అల్లాను పూజించాలని ప్రచారం చేయలేదన్న భక్తుల వాదనలోనూ నిజం దాగివుంది.

నిజానికి మతం కన్నా గుణం గొప్పది. సాయిబాబా భక్తులు సనాతన ధర్మానికి చెందిన దేవుళ్ల చిత్రాలను వాడుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారన్న ఆరోపణలపై కూడా పాయి భక్తులు మండిపడుతున్నారు. సనాతన ధర్మాలకు చెందిన ఏ దేవుడి పుణ్యక్షేత్రంలోనైనా ధన ఖర్చు కాకుండా దైవదర్శనం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పుణ్యక్షేత్రాలు ధనదోపిడికి నిలయాలుగా మారుతున్న గునూజీలు, స్వామీజీలకు కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అనేకం వున్న హైందవ సంస్థలు ఈ దోపిడీని ఎందుకు చూసిచూడనట్లు వదిలేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. పుణ్యక్షేత్రాల బస్టాండు నుంచి స్వామి వారికి కొట్టే టెంకాయ వరకు, తీసుకునే ప్రసాదాలు, దర్శనాలు, గదులు ఒక్కటేమిటి అంతా దోపిడి. తిరుమల వెంకన్న కావచ్చు, యాదగిరి నర్సన్న కావచ్చు దమ్మిడీ లేకుండా దర్శన బాగ్యమిస్తారా..? వారిచ్చినా.. ఆలయ అధికారులు పంపుతారా..? అంటే పంపరు.

స్వామీజీలైనా మానవ మాత్రులేననన్న నిజం గ్రహించాలి. విమర్శలను చేసే ముందు తామేంటో తెలుసుకోవాలి..? భక్తుల విశ్వాసాలను గెలుచుకోవాలే తప్ప, వారిని ఇదే చేయాలని శాసించకూడదు. నాలుగు హితబోధలు చేసి.. భక్తులను, ప్రజలను సనాతన మార్గంతో పాటు సన్మార్గంలో నడిపించాలి. పరనింద చేస్తూ.. అవమానాల పాటు కాకుండా జాగ్రత్తపడాలని సాయి భక్తులు కోరుతున్నారు. ఎవరు దేవుడు అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా దైవత్వం అంటే మరేదో కాదు.. సాయం చేసే గుణం అని చాటలని సాయి భక్తులు అర్థిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  devotees  State government  Sai Baba  Swami Swaroopanand Saraswati  Supreme Court  PIL  

Other Articles