భారత దేశంలోని సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోనే సంపన్న వ్యక్తిగా ముకేష్ అంబాని తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత సన్ ఫార్మస్యుటికల్స్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ రెండవ స్థానంలో ఉన్నారు. హురూస్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో ఆర్సెల్లార్ మిట్టల్ చైర్మన్ ఎల్.ఎన్. మిట్టల్ మూడవ స్థానంలో, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జి నాల్గవ స్థానంలో హెచ్ సీఎల్ చైర్మన్ శివ నాడార్ ఐదవ స్థానంలో, హిందుజా గ్రూపు చైర్మన్ హిందుజా ఆరవ స్థానంలో ఉన్నారు. అటు పల్లోంజి గ్రూప్ చైర్మన్ పి.మిస్ర్తీ ఏడవ, ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా ఎనమిదవ, భారతి ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. ముఖేష్ ఆస్తి గతంతో పోలిస్తే.., 37శాతం పెరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ రూ.1.65లక్షల కోట్లుగా ఉన్నట్లు హురూస్ తెలిపింది.
అటు వందమంది బిలీనియర్లో ఎక్కువ పేర్లు ఉన్న దేశాలకు చెందిన వ్యక్తుల భారత్ ఆరవ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ప్రపంచ బిలీనియర్ల జాబితాలో మూడు పేర్లు తగ్గాయి. అయితే భారత్ స్థానం మాత్రం 2013లాగే ఆరవ స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే భారత్ లోనే అత్యథికంగా బిలీనియర్లు ఉన్నారు. అత్యధికంగా అమెరికాలో 571మంది బిలీనియర్లుండగా.., చైనా 190మందితో రెండవస్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్ 130మందితో మూడవ స్థానంలో నిలిచింది.
గతంలో కూడా ముఖేష్ అంబాని భారత కుబేరుల జాబితాలో ప్రధమ స్థానంలో నిలిచారు. అయితే గతంలో ఉన్న కొన్ని పేర్లు ఈ జాబితాలో లేకపోగా.., మరికొన్ని పేర్ల స్థానాలు మారాయి. మొత్తంగా భారత దేశం సంపన్న దేశం కాకపోవచ్చు కానీ భారతీయులు మాత్రం సంపన్నులు అని ఈ జాబితా నిరూపిస్తోంది. ప్రతి ఒక్కరి ఆస్తి వందలు, వేలు, లక్షల కోట్లుగానే ఉంది. అయితే వీరి ఆస్తి గురించి అధికారికంగా చెప్పుకునే సత్తా వీరికి ఉంది. కాని మన రాజకీయ నేతల లెక్కలు చూస్తే వారిలో కోటిశ్వరులు, బిలీనియర్లే కాదు.., ట్రిలీనియర్లు కూడా ఉంటారు. కాని అది కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కాబట్టి.., బయటకు చెప్పుకోలేరు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more