Nayini narsimha reddy comments on osmania university students

nayini narsimha reddy, nayini narsimha reddy wiki, nayini narsimha reddy ministry, telangana ministers, telangana cabinet, telangana mla and mps, telangana government, nayini narsimha reddy on osmania students, telangana movement, osmania university, osmania university courses, osmania university exams, osmania university results, osmania university students, oujac, ou students

home minister of telangana says osmania students protest for jobs is not correct first they pass courses then fight for jobs : nayini narsimha reddy comments on osmania students and 1969 telangana fighters says 1969 people become maoists

ఓయూ విద్యార్థి అయితే జాబ్ ఇవ్వాలా - హోంమంత్రి

Posted: 09/17/2014 11:30 AM IST
Nayini narsimha reddy comments on osmania university students

తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థుల నుంచి ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ నిరసిస్తూ రెండు నెలలుగా ఓయూ క్యాంపస్ లో విద్యార్థులు దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇంతజరుగుతున్నా ప్రభుత్వం అటువైపు వెళ్లటం లేదు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తుండగా.., వివాదాన్ని మరింత పెంచేలా హోంమంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి విద్యార్థులపై ఘాటుగా మాట్లాడారు. ఓయూ విద్యార్థి అయితే జాబివ్వాలా అని నిలదీశారు. విద్యార్థుల వరుస గొడవలపై స్పందించిన హోంమంత్రి.., ‘‘ఓయూ విద్యార్థులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి.., క్యాంపస్ లో చదువుకుంటున్నవారంతా పాస్ అయ్యారా అసలు’’ అని ప్రశ్నించారు. ముందు పరిక్షలు పాస్ కండి.. ఆ తర్వాత ఉద్యోగాల మాటెత్తండి అని స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ లో జరిగిన రైల్వే కార్మికుల సమావేశంలో నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల నిరసనలు, ఆందోళనల వెనక కొన్ని రాజకీయ పార్టీలున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలే విద్యార్థులను రెచ్చగొడుతున్నాయన్నారు. ఇంతటితో ఆగకుండా 1969 తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్లుగా హోంమంత్రి మాట్లాడారు. 1969 ఉద్యమకారుల వల్ల తెలంగాణ రాలేదన్నారు. 2009 ఉద్యమకారుల వల్లే ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిందని చెప్పారు. అంతేకాకుండా 1969 ఉద్యమంలో పాల్గొన్నవారు మావోయిస్టులుగా మారి అడవుల్లో ఉన్నారని అన్నారు. 1100మందికి పైగా బలిదానం చేసుకోగా.., వారి ఆత్మలపై తెలంగాణ రాష్ర్టంగా ఆవిర్భవించిందని హోంమంత్రి చెప్పారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి రోజూ ఓయూకు వాహనాల్లో బయల్దేరిన ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అటువైపు కూడా వెళ్ళటం లేదు. విద్యార్థులపై లాఠీ దెబ్బ పడితే నిరసనలకు దిగిన ప్రస్తుత మంత్రులు.., ఇప్పుడు వారిపై నిత్యం లాఠీచార్జ్ లు జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు విద్యార్థులు మరోవైపు రాజకీయ పార్టీలు ఈ అంశంపై రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీఆర్ఎస్ తమను వాడుకుని వదిలేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తుంటే.., కేసీఆర్ రాజకీయాలు బయటకు వస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు పుండుమీద గుంటూరు కారం చల్లినట్లుగా మంత్రి నాయిని వివాదాస్పదంగా మాట్లాడారు.

పెద్దమనిషిగా.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నాయినికి కేసీఆర్ పిలిచి హోంమంత్రి పదవి ఇవ్వటంతో పాటు ఆయన్ను ఎమ్మెల్సిని చేశారు. ఇలాంటి వ్యక్తి.., కేసీఆర్ ఇంటిపైకి గొడవ తెచ్చేలా మాట్లాడటంతో ఈ వివాదం ఎటు వెళ్తుందో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులతో వదిలిపెట్టకుండా 1969 ఉద్యమకారులను కూడా ఏకిపారేశారు. అటు ఉద్యమకారులు నక్సలైట్లు, మావోయిస్టులు అయ్యారని విమర్శించారు. 2009 ఉద్యమంలో క్యాంపస్ లోకి నక్సలైట్లు వచ్చారని వారే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని సీమాంధ్ర నేతలు పలువురు ఆరోపించారు. వారన్నదే నిజం అయితే.., వారి వల్లే ఉద్యమం ఉప్పొంగిందని చెప్పవచ్చు. అది కాకపోయినా రాష్ర్ట ఏర్పాటులో వారి (1969 ఉద్యమకారుల) భాగస్వామ్యం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మరి హోంమంత్రి గారు మాత్రం ఇలా మాట్లాడి వివాదాలను సికింద్రాబాద్ కు వెళ్ళి మరి కొనితెచ్చుకున్నారు. విద్యార్థి సత్తాకు కేంద్రమే దిగివచ్చి డిసెంబర్ 9 ప్రకటన చేసింది. ఇది ప్రపంచానికి తెలిసిన నిజం. అప్పుడు ఉద్యమానికి వారే ఊపిరి.. వారే ఆయువుపట్టు. అలాంటి ఉద్యమకారులు ఇప్పుడు ఏం చేస్తారో.. పరిణామలు ఏ ప్రకంపణలు సృష్టిస్తాయో.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayini narsimha reddy  osmania university  telangana  latest news  

Other Articles