Facebook users will be in risk with unknown issues

facebook, facebook login, facebook hacking, facebook account information, facebook problems, facebook security, facebook application, social media, latest news, survey

a survey tells us that facebook users will get more risk from unknown persons likes, and other activities : facebook users must alert on their activities in all the time says a suvey

ఫేస్ బుక్ స్కాంలో మీరున్నారా? చూసుకోండి.. !!

Posted: 09/16/2014 06:07 PM IST
Facebook users will be in risk with unknown issues

ఫేస్ బుక్ వినియోగదారులకు కొత్త కష్టాలు వచ్చాయి. ముఖ పుస్తకం ద్వారా స్కాములు జరుగుతున్నాయని ఓ సర్వే గుర్తించింది. అంతేకాదు ఈ సర్వేలో యూజర్లు వారికి తెలియకుండానే స్కాంలో పాల్గొంటున్నారట. ఫేస్ బుక్ ఎక్కువగా వాడే యూజర్లు.., చాలా మంది ఫ్రెండ్స్ ను కలిగి ఉంటారని.., దీంతో వారికి ఎవరు.., ఏమిటి అని గుర్తుంచుకుని చాట్ చేసే సామర్ధ్యం తక్కువగా ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇలాంటి యూజర్లను గుర్తించే స్కాము వీరులు వారికి ఫ్రెండ్ రిక్వస్టులు పంపిస్తే ఆమోదించటంతో స్కాం మొదలవుతుందట.

స్కాం ఎలా మొదలవుతుంది

రిక్వస్ట్ ఆమోదించగానే వారితో ఫిషింగ్ దాడులు మొదలుపెడుతున్నారు. వినియోగదారులకు తెలియకుండా వారి ఈమెయిల్, పాస్ వర్డ్ హ్యాక్ చేసి ఇతరులకు మెసేజ్ లు పంపటం వంటి అక్రమాలకు తెరతీస్తున్నారను. అంతేకాదు తీవ్రవాదులు ఇలాంటి ఎత్తులతో అమాయకులను బలి చేస్తున్నారని సర్వే తేల్చింది. ఓ భారతీయ సంతతి వ్యక్తి బఫెలో యునివర్సిటీలో పనిచేస్తూ.., ఫేస్ బుక్ స్కాంపై సర్వే చేశారు. దీనిలో చాలామంది యూజర్లు తెలియకుండా స్కాంలో పాల్గొన్నట్లు నిర్ధారన అయింది. కేవలం మెసేజులు పంపటమే కాకుండా., ఫేస్ బుక్ తో లింక్ అయి ఉన్న ఈ మెయిల్స్ తెలుసుకుని వాటితో లింక్ అయి ఉన్నబ్యాంకు ఖాతాలను కనుక్కోవటం.., ఖాతాలకు పాస్వర్డ్ హ్యాక్ చేసి ఆన్ లైన్ షాపింగ్, మనీ ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నట్లు కూడా తేలింది.

ఫేస్ బుక్ వినియోగం ఎక్కువగా ఉండే వారు ఈ ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని సర్వే చేపట్టిన డాక్టర్ అరుణ్ విశ్వనాధ్ తెలిపారు. కొత్తవారు..., అపరిచితులు పంపే రిక్వస్టులకు స్పందించకుండా ఉండటమే ఉత్తమంగా సూచించారు. అంతేకాకుండా ముఖపుస్తక వినియోగం కూడా పరిమితంగా ఉండాలన్నారు. రోజులో ఎదో కొద్ది సమయం దానికి కేటాయిస్తే సరిపోతుంది కానీ.., బానిసలా మారిపోతే పెను ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు. సో ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్కాములో ఉన్నారా..? లేదా? ఓ సారి చూసుకోండి. వీలయితే సెక్యురిటీ వివరాలను మార్చుకుని.. ప్రైవసీని మరింత పెంచేయండి. లేకపోతే ఇబ్బందులు తప్పవు మరి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  unknown  survey  latest news  

Other Articles