Trs party senior leaders blackmailing tdp party ministers and forcing them to join trs party

trs party, blackmailing operation, trs party latest news, trs party ministers, trs party leaders, tdp party leaders, greater hyderabad news, ghmc

trs party senior leaders blackmailing tdp party ministers and forcing them to join trs party

హైదరాబాద్ లో టీఆర్ఎస్ ‘‘గ్రేటర్’’ బ్లాక్ మెయిల్ దందా! ABN

Posted: 09/13/2014 01:58 PM IST
Trs party senior leaders blackmailing tdp party ministers and forcing them to join trs party

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ... రాష్ట్రంలో వున్న అవినీతి మురికిని పూర్తిగా తుడిచేస్తామని ప్రకటించిన తరుణంలో ఇప్పుడు ఆ పార్టీయే ఆ మురికిలో దొర్లుతున్నట్టు కనిపిస్తోంది. అవినీతిని అంతమొందించడానికి బయలుదేరిన తెలంగాణ పెద్దలు... అవినీతి చేస్తూ పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’’ న్యూస్ ఛానెల్ ఒక వార్తకథనాన్ని ప్రసారం చేసింది. దీంతో ఇది అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

ఈ వార్తాకథనం ప్రకారం.. తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అన్ని జిల్లాల్లో బాగానే పట్టు వుంది కానీ ఒక్క హైదరాబాద్ లో మాత్రం అంతగా లేదు. ఎక్కడో రెండు, మూడు ఎమ్మెల్యే స్థానాలను తన ఖాతాలో జమచేసుకుంది! దీంతో ఆ పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో పట్టు సాధించే పనిలో అవినీతి మార్గాలను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగబోతున్న జీఎచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎట్టిపరిస్థితుల్లోనైనా తమ పార్టీయే గెలవాలన్న అత్యాశతో టీఆర్ఎస్ పెద్దలు తప్పటడుగులు వేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో చాలావరకు ప్రత్యర్థ నాయకులే వున్నారు. ఈ ఎలక్షన్స్ లో కూడా వాళ్లే గెలిచే అవకాశాలు చాలా వున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన టీఆర్ఎస్ పెద్దలు... ఇలా అక్రమ, అవినీతి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ లో జరగబోయే జీఎచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ముందుగా ప్రత్యర్థ నాయకుల మద్దతు అవసరముంటుంది. అయితే ఆ నాయకులందరూ టీఆర్ఎస్ లోకి చేరిపోతే ఆ పార్టీకి ఎనలేని బలం వచ్చిపడుతుంది. దీంతో ఈ విషయాన్ని గ్రహించిన టీఆర్ఎస్ పెద్దలు.. తమ ప్రత్యర్థ నాయకుల దగ్గరకు నేరగా వెళ్లి రాయబారినికి దిగుతున్నారు. మొదటగా తమ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు. కానీ ప్రత్యర్థ నాయకులు అందుకు ససెమిరా అంటుంటే.. నేరుగా వాళ్లమీద బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచారం. మర్యాదగా తమ పార్టీలో చేరితే సరేసరి.. లేకపోతే మీ నియోజకవర్గానికి చెందాల్సిన ఫండ్స్, ఇతర వ్యవహారాలు మంజూరు కాకుండా చర్యలు తీసుకుంటామంటూ టీఆర్ఎస్ పెద్దలు వార్నింగ్ లు ఇస్తున్నారు.

అంతేకాదు.. ఎమ్మెల్యేల వ్యాపారాలను టార్గెట్ చేస్తామని... వాటిని మొత్తం మూయించేస్తామని హెచ్చరికలు జారీ చేస్తారు. ఆర్థికంగా దెబ్బతీస్తామని బెదిరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయకూడదంటూ స్థానిక అధికారులకు టీఆర్ఎస్ మంత్రులు ఆదేశాలు జారీ చేస్తున్నారని వారు తెలుపుతున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీడీపీ మంత్రులు... టీఆర్ఎస్ పార్టీతో పోరుగా సిద్ధమంటూ పావులు కదులుతున్నారు. శేరిలింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. కారెక్కాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ మీద ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి నేరుగా మంత్రితో మాట్లాడిన కూడా ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad city  ghmc elections  trs party  tdp party ministers  

Other Articles