Who wins the big battle

Maharashtra, Maharashtra Assembly Polls, Congress, Nationalist Congress Party, NCP, Shiv Sena, Bharatiya Janata Party, BJP, Haryana Assembly Polls, Bhupender singh hooda, Yuvraj singh

Which party wins maharastra and Haryana assembly polls

మరో ఎన్నికల సంగ్రామంలో విజేతలెవరో..?

Posted: 09/13/2014 12:28 PM IST
Who wins the big battle

కేంద్ర ఎన్నికల సంఘం మరో ఎన్నికల సమరానికి నగరాను మ్రోగించింది. సుమారుగా నెల రోజుల తరువాత మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది. బీజేపి పార్టీకి ఏకపక్ష విజయాన్ని అందించి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజల నిర్ణయానికి ఈ ఎన్నికలు సవాల్ గా మారనున్నాయి. ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో వుంది. అంతేకాదు.. ప్రభుత్వ వ్యతిరేకతను రెట్టింపయ్యే స్థాయిలో పద్లేళ్లు, పదిహేనేళ్లగా అధికారంలో కోనసాగుతోంది. హర్యానాలో పదేళ్ల పాటు, మహారాష్ట్రలో పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో వుంది. వీటికి తోడు అవినీతి కుంభకోణాల నీలినీడలు ఇంకా పార్టీని వీడలేదు. మహారాష్ట్రంలోనే జరిగిన ఆధర్శ్ స్కామ్, వ్యవసాయ ప్రాజెక్టు కుంభకోణాలను ప్రజలు మరచిపోలేదు. సార్వత్రిక ఎన్నికల తరువాత ఇటీవల జరిగిన ఆరు రాష్ట్రాల ఉప ఎన్నికలలో బీజేపి బలం కొంత మేర తగ్గింది. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను, మార్పలను ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వంద రోజుల పాలనో తీసుకురాలేక పోయిందని అధికార పార్టీపై కూడా దేశప్రజలు కాస్త గుర్రుగా వున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీలు గెలుస్తాయన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.

‘మహా’ సంగ్రామం

మహారాష్ట్ర, అసెంబ్లీ ఎన్నికలకు తెర లేవడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా మహా సంగ్రామ వాతావరణం అలుముకుంది. దశాబ్దమున్నర కాలం పాటు పాలించిన అధికార కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని మరోసారి ప్రజలు ఆదరిస్తారా..? లేదా అన్నది వేచి చూడాల్సిందే. గత 15 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది పనులను చూసి ఓటువేయాలని అధికర కూటమి ప్రజల్లోకి వెళ్తుండగా, మార్పు కోసం తమను అదరించాలని బీజేపి-శివసేన కూటమి ఓటర్లను కోరుతుంది.

అభివృద్దే మమల్ని గెలిపిస్తుంది: కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి

గత పదిహేను ఏళ్లుగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని.. అవే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడు పర్యాయాలుగా వచ్చిన ఫలితాలే ఈ దఫా కూడా వస్తాయని, తమను గెలిపిస్తాయని అంటున్నాయి. 15 ఏళ్ల పాలనతో తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత భావం రాలేదని, వచ్చినా.. అభివృద్దే వాటికి సమాధానం చెబుతుందని కూటమి వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఇచ్చిన పెద్ద హామీలేమి ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని విమర్శించాయి. ఆయన చేసిన హామీలనే తాము ఎన్నికల ప్రచారంగా వినియోగిస్తామని చెప్పాయి.

కాంగ్రెస్, ఎన్సీపి కూటమి మధ్య కొలిక్కి రానీ సీట్ల సర్ధుబాటు

మహారాష్ట్రలో మూడు పర్యాయాలుగా అధికారంలో వున్న కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి సఖ్యత మధ్య బీటాలు వారనున్నాయి. గత మూడు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలకు కలసి వెళ్లిన పార్టీలు.. ఈ దఫా మాత్రం ఎన్నికలకు ఒంటరిపోరునే ఎంచుకునే అవకాశాలున్నాయి. సీట్ల సర్ధుబాటు విషయమై ఇరు పార్టీల ఓ అవగాహనకు రాలేకపోయాయి. దీంతో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్థుబాటు చర్చలకు బ్రేక్ పడింది. అయితే మహారాష్ట్ర పీసీసీ అద్యక్షుడు మాణిక్ రావు థాక్రే మాత్రం రెండు మూడు రోజుల్లో ఈ విషయం కొలిక్కి వస్తుందన్నారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఏ మేరకు అవగాహనకు వస్తారో వేచి చూడాల్సిందే..

మార్పు కోసం ఓటయాలని అభ్యర్థిస్తాం: బీజేపి-శివసేన కూటమి

మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పే తమను గెలిపిస్తుందని బీజేపి-శివసేన కూటమి శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ హయంలో నీటి ప్రాజెక్టు కాంట్రాక్టులలో జరిగిన అవినీతిని, ఆదర్శ స్కా కుంభకోణాలను ప్రజలు మరచి పోలేదని దుయ్యబట్టాయి. ప్రజాసోమ్మును ఇష్టానుసారంగా దోచుకోవడమే పరిపాలన అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల జీవితాలలో మార్పు, రాష్ట్ర రైతాంగంలో వెలుగులు నింపే మార్పు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర మార్పలు తమతోనే సాధ్యమని బీజేపి-శివసేన కూటమి శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అవినీతి బాగోతాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటామని తెలుపుతున్నాయి.

హ్యట్రిక్ సాధించి తీరుతాం: భూపేందర్ సింగ్ హూడా

ఇక అటు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తామే విజయం సాధిస్తామని ధీమ వ్యక్తం చేశారు. హర్యానాలో కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికలకు తమ పార్టీ అన్నివిధాలుగా సన్నధమైవుందన్నారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వ సానుకూల పవనాలు వున్నాయని, తమ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వుందని తెలిపారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అన్ని రంగాలలో అభివృద్ది సాధించామని చెప్పారు. పనిలో పనిగా బీజేపిపై విమర్శల వర్షం కురిపించారు.

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం.. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందని దుయ్యబట్టారు. ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లిన మోడీ మార్కు ఇక పనిచేయదని భూపిందర్ హూడా ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రంలో అవినీతి లేదని, బీజేపిలోనే అక్రమార్కులు వున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత మూడు నెలల పాలనలో మోడీ సర్కార్ ప్రజాహిత కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదన్నారు. రైలు చార్జీలను పెంపు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల అంశాలను తాము ప్రచారాస్త్రాలుగా వాడుకుంటామని స్పష్టం చేశారు.

సిద్దూ స్థానాన్ని భర్తీ చేయనున్న యువరాజ్

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో తాను బీజేపి తరపున ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టనున్నట్లు క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రకటించారు. పంజాబ్, హర్యానాలలో క్రితం సారి జరిగిన ఎన్నికలలో బీజేపి తరపున ప్రచారం చేసి, ఎంపీగా ఎన్నికైన నవజ్యోత్ సింగ్ సిద్దూ.. ఈ సారి పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండటంతో.. ఆయన స్థానాన్ని యువరాజ్ సింగ్ భర్తీ చేశారు. ఇంతకు ముందే బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలసిన యువరాజ్ తాను హర్యానా ఎన్నికలలో ప్రచారాన్ని నిర్వహిస్తానని చెప్పినట్లు సమాచారం. సుపరిచితుడైన క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రచారంతో ఇక బీజేపి అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనుంది. ఎవరెంత ప్రచారం చేసినా.. ప్రజలు వారి నిర్ణయించుకున్న వారికే ఓటు వేయడం ఖాయం.. మరి ఓటరు తీర్పు తెలుసుకోవాలంటే వచ్చే నెల 19 వరకు ఆగాల్సిందే..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles