Up court summoned one year old boy

elections, bypoll, by elections, uttarpradesh, akileshyadav, moradabad court, judiciary, court notice, summons, polie, crpc 1973, crpc 107/16, security bond, police, court registrators, latest news, one year boy, baby, boy, girls, child

a court in uttarpradesh summoned one year old boy and his father for prevention of peace voilation act : moradabad court summons one year old boy with police information

ఏడాది వయస్సు బాలుడికి కోర్టు సమన్లు

Posted: 09/11/2014 12:33 PM IST
Up court summoned one year old boy

ఏమి తెలియని వారితో అయినా తమ ట్రీట్ మెంట్ తో నేరం చేసినట్లు ఒప్పించగల సత్తా మన దేశ పోలిసులకుంది. చివరకు ఏడాది బాలుడైనా, పండు ముసలి అయినా సరే చట్టం దృష్టిలో అందరూ సమానమన్నట్లు వ్యవహరించి చేతులు కాల్చుకున్నారు. పోలిసుల అత్యుత్సాహం ఫలితంగా అమ్మ ఒడిని దిగటానికి కూడా ఇష్టపడని బాలుడు.., ఏకంగా కోర్టుమెట్లు ఎక్కాడు. రాజకీయాల పుణ్యమా అని ఏడాది బాలుడిపై కూడా అభియోగాలు మోపి కోర్టుకెక్కేలా చేశారు పోలిసులు.

మెరాదాబాద్ జిల్లా ఠాకూర్ ద్వారాలో ఈనెల 13న ఉప ఎన్నిక జరగనుంది. ఈ సందర్బంగా బందోబస్తుపై సమీక్ష జరిపిన పోలిసులు శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ముందస్తు జాగ్రత్తగా పాత నేరస్తులు, రౌడీ షీటర్ల నివేదికను తయారు చేసి కోర్టుకు అందించారు. నివేదికలో పేర్లున్నవారికి కోర్టు సమన్లు పంపించింది. లిస్ట్ లో పేరున్నందున యాసిన్ తో పాటు అతని కుమారుడు ఏడాది వయస్సున్న బాలుడు నజీమ్ కు కూడా సమన్లు అందాయి. ఇద్దరూ ఊరిలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. నోటిసుల్లో పేర్కొన్న ప్రకారం తండ్రి, కొడుకులు కోర్టుకు రూ.50వేల  సెక్యురిటీ బాండు ఇవ్వాలి. లేకపోతే చట్ట ప్రకారం ఇద్దరినీ అరెస్టు చేసి జైలులో పెడతారు.

నోటిసులు చూసిన నజీమ్ అవాక్కయ్యాడు. ఏడాది వయస్సున్న తన కొడుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఏంటని ఆశ్చర్యపోయాడు. నోటిసులతో పాటు కొడుకుని తీసుకుని మొరాదాబాద్ కోర్టుకు వెళ్లాడు. తన కొడుకు ఎలా శాంతికి విఘాతం కల్గిస్తాడో చెప్పాలని కోరాడు. కోర్టు ఆదేశాల ప్రకారం యాసిన్ సెక్యురిటీ బాండు చెల్లించాడు. కొడుకు గురించి కోరగా అతనికి వచ్చిన నోటిసును తప్పుగా తెలుసుకుని కొట్టిపారేశాడు. ఈ విషయం న్యాయమూర్తికి తెలియటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి ఏడాది వయస్సున్న బాలుడి పేరు నేరస్తుల జాబితాలో ఎలా రాస్తారని ఘటనపై విచారణకు ఆదేశించారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : one year boy  moradabad court  bypoll  latest news  

Other Articles