Kcr delhi tour details

kcr, kcr delhi tour, cm kcr, telangana, trs, telangana government, delhi, piyush goyal, power projects, solar power, latest news, prime minister, narendra modi, home minister, central ministers

kcr met all major ministers of central during his delhi tour : telangana cm applications to ministers for telangana allocations succesfully completed his delhi tour

కేసీఆర్ ఢిల్లీ పర్యటన సక్సెసా.. కాదా?

Posted: 09/07/2014 08:18 PM IST
Kcr delhi tour details

కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ, నరేంద్రమోడి సహా కేంద్రం పెద్దలందర్ని వరుసపెట్టి కలిశారు. నేతలందరితో సమావేశం అయ్యారు. విభజన తర్వాత రెండవసారి హస్తినకు వెళ్ళిన కేసీఆర్ పెద్ద చిట్టానే తీసుకెళ్ళారు. తెలంగాణకు కేటాయింపులే లక్ష్యంగా ఈ సారి పర్యటన జరిగింది. పర్యటన ముగించుకున్న కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. కేంద్రం పెద్దలతో ఆయన జరిపిన చర్చలు ఏ మేరకు సఫలం అయ్యాయి.., తెలంగాణకు ఎన్ని కేటాయింపులు దక్కాయి అనే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ప్రత్యేక హోదా కోసం ప్రధానితో భేటి

హస్తినకు వెళ్లిన తొలిరోజునే ప్రధాని నరేంద్రమోడితో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ భేటిలో ప్రధానంగా తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకూ ఆ హోదా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీనితో పాటు రాష్ర్టంలో ఉన్న పరిస్థితులపై  చర్చ జరిపారు. మొత్తం 20 అంశాలపై మోడికి కేసీఆర్ విజ్ఞప్తులు చేశారు. అదేవిధంగా మెట్రోపోలిస్ సదస్సుకు హాజరుకావాలని కూడా కేసీఆర్ ఆహ్వానించారు. ఇక రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిసి మెట్రో పోలిస్ సదస్సుకు రావాలని కోరారు.

పవర్ సాధించారు

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తో కేసీఆర్ సమావేశం ఫలప్రదమైంది. తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీర్చేందుకు అదనపు కేటాయింపులు జరపాలని కోరారు. దీంతో పాటు విభజన చట్టంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులను త్వరగా కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన గోయల్.., 100మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాుటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కూడా కేసీఆర్ కలిశారు. ఏపికి వీలైనంత త్వరగా హైకోర్టును కేటాయించాలని కోరారు.

చట్టం చిక్కులు విప్పండి

ఇక కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వీరి భేటిలో విభజన చట్టంలో వివాదాస్పదంగా ఉన్న అంశాలపై చర్చ జరిగింది. గవర్నర్ అధికారాలు, చట్టాల అమలు ఇతర వివాదాస్పద అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ర్టంలోని శాంతిభద్రతలపై హోంమంత్రితో చర్చ జరిపారు. మరో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తో కూడా కేసీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. పరిశీలిస్తామని హామి ఇచ్చారు. పర్యటనలో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానితో కూడా కేసీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణకు ఐఐఎంను కేటాయించాలని కోరారు. అంతేకాకుండా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను తెలంగాణలో నెలకొల్పాలని అందుకు కావాల్సిన స్థలం తమ ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పారు. ఇందుకు మంత్రి  సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.


ఇలా ప్రతి ఒక్క మంత్రికి ప్రతిపాదనలు.., విజ్ఞప్తులు అందిస్తూ రెండ్రోజుల పాటు హస్తిన చుట్టారు కేసీఆర్. మరి ఈ ప్రతిపాదనలు ఏ మేరకు ఫైళ్ళవుతాయి.., ఎప్పుడు అమలవుతాయి అనేది భవిష్యత్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అంటే కేంద్రంతో సఖ్యతగా ఉండటం.., కేంద్రంకు తెలంగాణపై ఆసక్తి ఉండటం. ఈ రెండు ఉన్నపుడే తెలంగాణకు నిధులు వచ్చి మెరుగైన అభివృద్ధి జరుగుతుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  delhi tour  central ministers  latest news  

Other Articles