Goyal granted solar power project to telangana

kcr, kcr delhi tour, cm kcr, telangana, trs, telangana government, delhi, piyush goyal, power projects, solar power, latest news, mahaboob nagar, palamooru

central minister announced solar power project to telangana : new solar power project granted solar power project to telangana during kcr delhi tour

కేసీఆర్ కు పవర్ ఇచ్చిన కేంద్రం

Posted: 09/07/2014 10:19 AM IST
Goyal granted solar power project to telangana

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం దగ్గర బాగానే లాబీయింగ్ చేస్తున్నారు. వెళ్ళింది రెండవసారే అయినా తన పనులన్ని చక్కబెట్టుకుంటున్నాడు. తెలంగాణ కేటాయింపుల చిట్టాతో హస్తినకు వెళ్ళిన చంద్రశేఖరుడు ప్రాజెక్టులు, కేటాయింపులు దక్కేలా మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో జరిపిన కేటాయింపులు తెలంగాణకు త్వరలోనే ప్రాజెక్టుతెచ్చిపెడుతుంది.

పర్యటనలో భాగంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తో కేసీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో ఉన్న విద్యుత్ కష్టాలను మంత్రికి ఏకరవు పెట్టారు. ఆంధ్ర నుంచి వస్తున్న కరెంటు.., తెలంగాణ నుంచి వెళ్తున్న కరెంటు.., బొగ్గు ఇతర అంశాలపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో తెలంగాణకు జరిపిన కేటాయింపులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ సందర్బంగా తెలంగాణకు రూ.1,320కోట్ల విలువైన వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని గోయల్ ప్రకటించారు.

విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామి ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. విభజన బిల్లులో చెప్పిన ప్రకారమే నాలుుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయటంలో భాగంగా తొలి దశలో సోలార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. మహబూబ్ నగర్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  delhi tour  solar power  latest news  

Other Articles