Rape accused s sister gang raped

girl rape, revange gang rape, uttarprades rapes, woman attacks, woman harassment, sexual assults, akilesh yadav, latest news

girl in uttar pradesh gang raped for revange on her brother raping another's sister : a rape accused's girl gang raped for revange in uttar pradesh

చర్యకు ప్రతిచర్యలా.. రేప్ కు గ్యాంగ్ రేప్

Posted: 09/02/2014 04:05 PM IST
Rape accused s sister gang raped

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను అజ్ఞానులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. రేప్ కు రేప్ తోనే సమాధానం చెప్పాలని ఓ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ముఝఫర్ నగర్లో ఈ దారుణం జరిగింది. ఒక వర్గం అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువకుడు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. రేప్ కు గురయిన బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడిపై పగతో ఊగిపోయారు. రేప్ కు రేప్ తోనే సమాధానం చెప్పాలని భావించారు. సరైన సమయం కోసం ఎదురు చూశారు.

ప్రతికారం తీర్చుకోవటానికి ఎదురుచూస్తున్న అవతలి వర్గం నిందితుడి ఇంటిపై నిఘా పెట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం ఎదురుచూసింది. ఒక సారి ఇంట్లో ఎవరూ లేకుండా నిందితుడి సోదరి మాత్రమే ఉండటం గమనించి ఆమెను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం రహస్య ప్రాంతంలో గ్యాంగ్ రేప్ కు పాల్పడి పరారయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలిసులను ఆశ్రయించింది. కంప్లయింట్ తీసుకున్న పోలిసులు ఐదుగురిలో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు.

సామూహిక అత్యాచారానికి గురైన యువతి అవమాన భారం భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. కుమ్హేడ బ్రిడ్జి నుంచి దూకేందుకు ప్రయత్నించగా గమనించిన స్థానికులు అడ్డుకుని.., ఇంటికి తీసుకెళ్ళారు. ప్రతీకార గ్యాంగ్ రేప్ పై ముఝఫర్ నగర్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని కక్క్రౌలి పోలిస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. రేప్ చేస్తే నిందితుడిని అరెస్టు చేయాలి.., శిక్షించాలి కానీ, ఏ పాపం తెలియని అతని సోదరిపై క్రూరంగా సామూహిక అత్యాచారానికి ఒడిగడతారా అని మండిపడ్డారు. దారుణానికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకుంటామని పోలిసులు చెప్పటంతో ఆందోళన విరమించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang rape  revange rape  latest news  uttar pradesh  

Other Articles