Tamilnadu bjp president tamilisai soundara rajan denies the rumours on rajnikanth joining bjp party

rajnikanth, rajnikanth bjp party, rajnikanth joining bjp party, rajnikanth latest news, rajnikanth news, rajnikanth movie, tamilisai soundararajan, tamilisai soundara rajan interview, narendra modi, narendra modi rajnikanth, rajnikanth narendra modi

tamilnadu bjp president tamilisai soundara rajan denies the rumours on rajnikanth joining bjp party

రజనీకాంత్ బీజేపీ పార్టీలోకి చేరిపోయారు!

Posted: 08/26/2014 06:42 PM IST
Tamilnadu bjp president tamilisai soundara rajan denies the rumours on rajnikanth joining bjp party

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మీద గత కొన్ని రోజులుగా రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా ఆయన త్వరలోనే బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని.. ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి అగ్రనేతలు సైతం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని మీడియాలో ఎన్నో వార్తాకథనాలు వచ్చాయి. ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే రజనీకాంత్ ను కలవడానికి వచ్చారని... అలాగే మొన్న బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ - మోడీ సన్నిహితుడు అమిత్ షా కూడా ఆయనతో మంతనాలు జరిపారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఈయన పార్టీలోకి జాయిన్ అవడానికి సుముఖత వ్యక్తం చేస్తే... తమిళనాడు రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా ఆ పార్టీ సిద్ధంగా వుందనే కథనాలు కూడా వచ్చాయి.

అయితే తమపై వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ తమిళనాడు పూర్తిగా ఖండిస్తూ.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం తాము వెంపర్లాడుతున్నట్టు వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ వారు తమ మాటను మారుస్తూ కొంచెం ప్రత్యేక రీతిలో విశ్లేషణ ఇచ్చుకున్నారు. అదేమిటంటే.. రజనీకోసం తాము వెంటపడటం లేదుకానీ.. ఆయన మాత్రం తమవాడేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. రజనీకాంత్ కు బీజేపీ పార్టీ అంటే చాలా గౌరవమని.. అలాగే ఆయనంటే బీజేపీ పార్టీ చాలా సానుకూలంగా వుందని అని చెప్పిన ఆమె... ఆ మర్యాదతోనే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, రజీనీకాంత్ తో కలుసుకున్నారని అన్నారు. అంటే.. బీజేపీ పార్టీలోకి సూపర్ స్టార్ ఎప్పుడో చేరిపోయాడనే ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదిలావుండగా.. రాబోయే ఎన్నికల్లో రజనీని బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం కథనాలు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఆ కథనాలను తమ పార్టీ ఎప్పుడూ ధ్రువీకరించలేదని అన్నారు. గతంలో కూడా ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నదులను అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుకు రజనీకాంత్ కోటి రూపాయల విరాళం ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. జాతీయ దృక్పథం ఉన్న రజనీని తాము సాదరంగా స్వాగతిస్తామని... ఆయన స్వతహాగా పార్టీలోకి వస్తానంటే మేము సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే ఈమె మాట్లాడిన మాటలు విన్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు... బీజేపీ పార్టీలోకి రజనీకాంత్ చేరిపోయారన్న ధీమాతో ఆ పార్టీ వున్నట్లు తెలుపుతున్నారు. అయితే.. రజనీకాంత్ మాత్రం ఇంకా ఈ రాజకీయ దుమారంపై పెదవి మాత్రం విప్పలేదు. మరీ ఆయన పార్టీలోకి చేరుతారా..? లేదా..? అసలు రాజకీయ రంగంలోకి అడుగులు పెడతారా..? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే.. రజనీకాంత్ నేరుగా మీడియా సమావేశంలో మాట్లాడితే గానీ తెలియదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : super star rajnikanth  tamilisai soundararajan  narendra modi  bjp party  telugu news  

Other Articles