Anantapuram court issued arrest warrants on telangana gom 3 members

sushil kumar shinde, gulam nabi azad, chidambaram, bailable warrants, non bailable warrants, court, anantapuram court, telangana bill, ap state bifurecation, upa government, aicc, nda, sonia gandhi, latest news

anantapuram court issued arrest warrants on ex ministers azad, shinde, chidambaram in ap division case : anantapuram court issude bailable warratns on 3 ex ministers

ముగ్గురు మాజిలకు మూడింది

Posted: 08/22/2014 05:44 PM IST
Anantapuram court issued arrest warrants on telangana gom 3 members

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు తెలంగాణ రాష్ర్ట విభజన ఇప్పుడు ముగ్గురు కేంద్రమంత్రులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. అసలే రాష్ర్టాన్ని విభజించిన పాపానికి ఆంధ్రలో ఒక్కసీటు కూడా దక్కించుకోలేదు కాంగ్రెస్. పోని రాష్ర్ట మిచ్చినందుకు తెలంగాణ ప్రజలైనా ఆదరిస్తారనుకుంటే గౌరవించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రాజకీయంగా జరిగిన విభజనతో రెంటికీ చెడ్డ రేవులా తయారైన కాంగ్రెస్ ను విభజన సమస్య ఇంకా పట్టి పీడిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ఊపిరిసల్పకుండా చేసిన తెలంగాణ అంశం.., ఇప్పుడు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది. ఎందుకు చేశాము దేవుడా ఈ పని అనుకునేలా చేస్తోంది తెలంగాణ సమస్య. తాజాగా ముగ్గురు మాజి కేంద్ర మంత్రులకు అనంతపురం కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ముగ్గురూ  అప్పట్లో కీలక మంత్రులు, విభజనపై ఏర్పడ్డ జీఓఎం సభ్యులుగా ఉండటంతో అరెస్టు వారెంట్లపై అంతా హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు.

మాజి కేంద్ర మంత్రులు సుషీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, చిదంబరం పై అనంతపురం కోర్టు బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాట్లు రాజ్యాంగ విరుద్దమనీ.., ఈ నిర్ణయంతో సీమాంద్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గతంలో అనంతపురం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ సందర్బంగా ముగ్గురు మాజి కేంద్ర మంత్రులపై అరెస్టు వారెంట్లు ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. దీనిపై వారు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతప్రభుత్వంలో షిండే హోంమంత్రిగా, ఆజాద్ ఆరోగ్య శాఖ మంత్రిగా, చిదంబరం ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నారు. వీరంతా కీలక పదవుల్లో ఉండటంతో పాటు.., విభజన పనులను దగ్గరుండి చూసుకున్నారు. బిల్లు రూపకల్పన, ఆమోద ప్రక్రియను అంతా తామై నడిపించారు.

ముగ్గురు మంత్రులకు నోటిసులు జారి కావటంతో వారికి ఇదో తలనొప్పిగా మారింది. అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, సీమాంధ్ర ప్రజలు వద్దని వారిస్తున్నా తెలంగాణ ఇచ్చామని మాజి మంత్రులు అనుకుంటున్నారు. అంతేకాకుండా రాజకీయాల కోసం ఆలోచించకుండా కేసీఆర్ దీక్ష సమయంలో వెంటనే విభజన ప్రక్రియ మొదలు పెట్టి.., సీమాంధ్రకు న్యాయం చేసినా ఈ పరిస్థితి తలెత్తేది కాదని భావిస్తున్నారు. విభజన చేసి రెండు చోట్ల చేతులు కాల్చుకోవటం తప్ప ఒరిగిందేమి లేదని కాంగ్రెస్ నేతలంతా అంతర్మధనం చెందుతున్నారు. టీడీపీ, టీఆర్ఎస్ లను తొక్కిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఘోరంగా బెడిసికొట్టి., ఇప్పుడు ఆ పార్టీలే అధికారం చెలాయించేలా పరోక్షంగా కాంగ్రెస్ చర్యలు దోహదం చేశాయని రాజకీయ వర్గాలంటున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushil kumar shinde  azad  chidambaram  telangana bill  

Other Articles