New twist in salman khan hit and run case

salman khan latest news, salman khan hit and run case, salman khan case, salman khan in jail, hit and run case, mumbai court, hit and run case, drunk and drive case

new twist in salman khan hit and run case : A new twist came in bollywood hero salman khan's hit and run case which blows the minds of all members in the court

సల్మాన్ ‘హిట్ అండ్ రన్’ కేసులో మరో కొత్త ట్విస్ట్!

Posted: 08/21/2014 03:55 PM IST
New twist in salman khan hit and run case

బుల్లితెరపై వచ్చే సీరియల్స్ అన్ని ట్విస్టులు వుంటాయో లేదో తెలియదు కానీ.. బాలీవుడ్ కండల వీరుడు ‘‘హిట్ అండ్ రన్’’ కేసు మాత్రం సినిమా కథలా అనేక ట్విస్టుల మీద ట్విస్టులతో మలుపులు తిరుగుతూనే వుంది. ఇంతవరకు ఈ కేసులో వచ్చిన ట్విస్టులతో దిమ్మతిరిగిపోయిన న్యాయవాదులకు.. ఇప్పుడు మరో కొత్తరూపంలో వారి మతిని పోగొట్టేవిధంగా ఇంకొక కొత్త ట్విస్ట్ చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి తుది నిర్ణయాన్ని త్వరలోనే వెలువరిస్తాం అని ప్రకటించిన నేపథ్యంలో... ఏదో ఒక విధంగా దీనికి అడ్డంకులు వస్తూనే వున్నాయి. పాపం.. సల్మాన్ కూడా న్యాయస్థాన తుదినిర్ణయం ఏంటో తెలుసుకుందామని చాలా ఆతృతగా వున్నాడు... కానీ అతనికి నిరాశే మిగిలింది.

సల్మాన్ కేసుకు సంబంధించి డైరీ కనిపించడం లేదని.. కొన్ని డాక్యుమెంట్లు కూడా పోయాయని ముంబై పోలీసులు న్యాయస్థానానికి షాకింగ్ న్యూస్ తెలిపారు. నిన్నమొన్నటిదాకా వాటి ఆధారంగానే కేసు నడుస్తూ వచ్చిన నేపథ్యంలో.. ఇలా ఎలా మాయమవుతాయంటూ జడ్జీలు కూడా అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ వార్తను విన్న అనంతరం కొద్దిసేపటివరకు నివ్వెరపోయాడు. పోలీసులు ఈ విషయాన్ని తెలియజేసిన అనంతరం.. కోర్టు చేసేది ఏమీలేక తదుపరి చర్యలపై కొత్త రిపోర్టు ఫైల్ చేయాలని ప్రాసిక్యూషన్ ను ఆదేశించింది. దీంతో ఇప్పుడు వారు సల్మాన్ పై కొత్త రిపోర్టును ఫైల్ చేసే పనిలో మునిగిపోయారు.

అలాగే ఈ కేసు సంబంధించి మాజీ విచారణ అధికారి అయిన కిషణ్ షెంగల్ ను సెప్టెంబర్ 12వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా రానురాను ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసు విషయం అర్థంకాక చివరికి మూసేయాల్సి వస్తుందేమోనన్న అనుమానాలను కూడా కొంతమంది రేకెత్తిస్తున్నారు. గత 12 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్ మందుతాగి కారు నడుపుతూ ఫుట్ పాత్ పై నిద్రపోతున్న వారిపై తన కారును ఎక్కించగా.. అందులో ఒకరు మరణించారు.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయిన విషయం తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  hit and run case  drunk and drive case  mumbai court  

Other Articles