Samagra kutumba survey gif

telangana survey, hyderabad survey, samagra kutumba survey, hyderabad samagara kutumba survey, kcr news, kcr government, trs party news, telangana people, enumerators

Hyderabad samagra kutumba survey details revealed : telangana samagra kutumba survey is almost completed in telangana state. Mainly In Hyderabad city the most families are increased than expected.

సర్వేలో బయటపడ్డ నమ్మలేని నిజాలు!

Posted: 08/21/2014 11:31 AM IST
Samagra kutumba survey gif

తెలంగాణ ప్రభుత్వం యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం సమగ్ర కుటుంబ సర్వేను మంగళవారం (19-08-2014) నాడు నిర్వహించిన సంగతి తెలిసిందే! ఈ సర్వేలో భాగంగా ఎన్నోరకాల చర్చనీయాంశమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది ప్రముఖులు తమ వివరాలను ఇవ్వడానికి నిరాకరించగా.. మరికొంతమంది ఇందుకు గైర్హాజరయ్యారు. కొంతమందైతే కేవలం సగం వివరాలు మాత్రమే ఇవ్వగా... ఒక ప్రాంతంలో వుండే జనాలందరూ సర్వేకోసం వచ్చిన అధికారులను అక్కడి నుంచి పంపించివేశారు. ఇలా రకరకాల చోట్ల రకరకాల పరిణామాలు ఎదురయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ సర్వేలో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఎవరూ ఊహించని రీతిలో సర్వే లెక్కలు ఆశ్చర్యానికి గురి చేశాయి.

సమగ్ర కుటుంబ సర్వే తాజా లెక్కల ప్రకారం... మొత్తం 1,05,76,922 కుటుంబాలను ఇందులో నమోదు చేసినట్టు తేలింది. ముక్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే చాలా ఎక్కువ కుటుంబాలు నమోదైనట్టు సర్వే అధికారులు వెల్లడిస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోనే దాదాపు 21,60,601 కుటుంబాలు వున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. ఇప్పటికే అధికారులు దాదాపు 20,11,293 కుటుంబాలను అధికారులు సర్వే చేశారు. మరోవైపు 1,49,308 కుటుంబాలకు సర్వే నిర్వహించాల్సి మిగిలి వుంది. అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద దాదాపు 35 శాతం జనాభా భాగ్యనగరంలో వున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు హైదరాబాద్ సిటీలో నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం.. 18 సర్కిల్స్ లో ఎల్బీనగర్ లో కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువగా వున్నట్లు తేలింది. యావత్తు సిటీ మొత్తంలో ఎల్బీనగర్ అగ్రస్థానంలో వుందని వారు పేర్కొంటున్నారు. ఈ సర్కిల్ లో గతంలో కంటే అత్యధికంగా 87,377 కుటుంబాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. అలాగే అత్యధికంగా కుటుంబాలు పెరిగిన సర్కిళ్లలో ఎల్బీనగర్ తర్వాత వరుసగా కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ లు వున్నాయి. ఇక అబిడ్స్ -1 సర్కిల్ లో అత్యల్పంగా 3,445 కుటుంబాలు మాత్రం పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో నమోదైన లెక్కల అనంతరం... అధికారులతోపాటు రాజకీయ నాయకులు షాక్ కు గురయ్యారు. అనుకున్న పరిధికంటే ఎక్కువ జనాభానే నమోదు కావడం విశేషంగా మారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samagra kutumba survey  greater hyderabad  kcr latest news  hyderabad survey  

Other Articles