Google tracking the importance details of users

google, google now, google now application, mobile track, google mobile track, google users, google news, google latest news

google tracking the importance details of users : the famous search engine google tracking the details of users who are using google now application in their android and smartphone mobiles

తస్మాత్.. ‘‘గూగుల్’’తో జాగ్రత్త!

Posted: 08/20/2014 11:08 AM IST
Google tracking the importance details of users

ప్రపంచంలోనే ఇంటర్నెట్ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన ‘‘గూగుల్’’ అందరికీ ఎటువంటి సహాయసహకారాలను అందిస్తుందో మనందరికీ తెలిసిందే! బహుశా ఈ గూగుల్ లేకపోతే ఇంటర్నెట్ కూడా డీలా పడిపోయేది ఏమో! అంతటి ఫాలోయింగ్ వుంది దీనికి! అయితే ఇది మనకు ఏవిధంగా అయితే అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తుందో.. అదేవిధంగా మన పర్సనల్ విషయాలను కూడా దోచుకుంటోంది. ఏదైనా విహారయాత్రకు వెళ్లినా.. ఏదైనా పనిమీద మరో ప్రాంతానికి వెళ్లినా.. మనం ఏ చోటుకు వెళ్లినా.. ఆ వివరాలను ‘‘గూగుల్’’ మనకు తెలియకుండానే రహస్యంగా దాచేసుకుంటోంది. మనపై ఒక డిటెక్టివ్ లా ఇది నిఘా పెడుతోంది. అయితే ఇది అందరి విషయాలను కాదులెండి.. ఎవరైతే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తారో.. అటువంటి వారి విషయాలను మాత్రమే ఇది నోట్ చేసుకుని, దాచిపెడుతుంది. అందులోనూ ముఖ్యంగా ‘‘గూగుల్ నవ్’’ను వినియోగిస్తున్నవారు అయితేనే!

ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలో ‘‘గూగుల్ నవ్’’ను వినియోగిస్తున్నవారు ఏ ప్రాంతానికి వెళ్లినా.. అది వారి గూగుల్ అకౌంట్ లో నిక్షిప్తమైపోతుంది. గూగుల్ సంస్థవారు కొద్దినెలలపాటు ఆ వివరాలన్నింటినీ గూగుల్ సర్వర్లలో వుంచుతారు. అంతగా అనుమానం వుంటే.. మీరే ఒకసారి ‘‘గూగుల్ నవ్’’లోకి వెళ్లి చూసుకుంటే చాలు.. మీరు కొద్దిరోజులుగా ఎక్కెడెక్కడికి వెళ్లారో మొత్తం అన్ని వివరాలను మ్యాప్ పై ఎరుపురంగు చుక్కలతో చూపిస్తుంది. అయితే గూగుల్ లో ఈ సర్వీసు తప్పనిసరి కాదని.. కావాలంటే ఈ మొబైల్ ట్రాకింగ్ ను ఆఫ్ చేసుకోవచ్చని గూగుల్ సంస్థ చెబుతోంది. అంటే.. ఎవరైతే స్మార్ట్ ఫోన్లు వినియోగించుతున్నారో.. అటువంటి వారి విషయాలను మాత్రమే ఇది స్టోర్ చేసుకుంటున్నదమాట! సో.. తస్మాత్ జాగ్రత్త! ఒకవేళ మీ రహస్య వివరాలను (అంటే ఏ ప్రాంతానికి వెళ్లారోనన్న విషయాలు) గూగుల్ కు తెలియకూడదనుకుంటే.. మొబైల్ ట్రాకింగ్ ను ఆఫ్ చేసుకుంటే చాలు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google  mobile tracking  google now app  smartphones  android mobile phones  

Other Articles