Arrest warrant issued against andhra jyothy md radha krishna

Managing director, Vemuri Radhakrishna, Non-bailable arrest, Andhra jyothi news paper

arrest warrant issued against andhra jyothy md radha krishna: ABN Andhra Jyothi Vemuri Radhakrishna

ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణ ను అరెస్ట్ చేస్తారా?

Posted: 08/14/2014 09:42 AM IST
Arrest warrant issued against andhra jyothy md radha krishna

మీకు తెలుసా? ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ వేమూరి రాధాకృష్ణను అరెస్ట్ చేస్తారని .. ఒక ప్రముఖ దినపత్రిక పెద్ద అక్షరాలతో రాయటం జరిగింది. అయితే ఇందులో ఎంత నిజముందో, ఎంత అబద్దముందో అనేది కొద్ది నిమిషాల్లో తెలుస్తోంది. అయితే ఆ పత్రిక, ఆంద్రోజ్యోతి పత్రిక ఎండీ పై ఇలా ఎందుకు రాస్తుందో అర్థం కావటం లేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే?

ఖమ్మం జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ కల్లాస్ మెజిస్ట్రేట్ ఎ. సునీతారాని ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణని నాన్ బెయిలబుల్ పై అరెస్ట్ చేయలని అరెస్ట్ వారెంట్ జారీ చేయటం జరిగింది.

అరెస్ట్ వారెంట్ ఎందుకు?

2010 సంవత్సరంలో పూసా నరేందర్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా కోర్టులో కేసుద దాఖలు చేయటం జరిగింది. ఇతను ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన వ్యక్తి. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంద్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ..అప్పట్లో కేసు వేయటం జరిగింది.

అయితే ఖమ్మం కోర్టు అనేక సార్లు ఆంద్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కోసం ఎదురు చూసింది. ఆంద్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కోర్టుకు వస్తాడని, వాదనలు విని, త్వరగా తీర్పు చెప్పాలని ఖమ్మం కోర్టు భావించింది. కానీ ఆంద్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాత్రం కోర్టుకు వెళ్లకుండా.. ఆయన తరుపున ఇద్దరు న్యాయవాదుల ద్వారా ఇద్దరు పూచీదారులగా హాజరుపరిచారు. దీంతో విసిగిపోయిన కోర్టు .. ఆంద్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ.. వచ్చే నెల 10వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసింది.

ఇప్పుడు ఆంద్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కు తెలంగాణలో కోర్టు దెబ్బలు తగులుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త కేసులు, అరెస్ట్ పుట్టుకు రావటం వెనుక చూస్తుంటే.. సరికొత్త అనుమానాలకు దారీ తీస్తుంది. ఏమైన ఒక పత్రిక ఎండీ పై ఇన్ని కోర్టు కేసులు అంటే ఒక్కసారి ఆలోచించాలి? రాష్ట్రంలో ఆంద్రజ్యోతి దినపత్రిక విలువలు పాటించటం లేదా? మిలిగిన అన్నీ పత్రికలు .. విలువలు పాటిస్తున్నాయా? ఆంధ్రజ్యోతి పత్రిక అంటే ఎందుకు అంత కోపం? కేవలం ‘ఆంధ్ర’ అనే పదం ఉందనా? లేక మిగలిన పత్రికలపై ప్రేమా? ‘‘అంతేలే.. !! మీకు నచ్చితే.. నెత్తిన పెట్టుకుంటారు.. . మీకు నచ్చకపోతే..నేలకేచి కొడతారు!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles