Prakash javadekar statement on polavaram

polavaram project, polavaram village, telangana, andhrapradesh, ap re organisation bill, trs, bjp, tdp, latest news

prakash javadekar statement in parliament on polavaram project : javadekar says 3 states will effect by polavaram project

పోలవరంతో మూడు రాష్ర్టాలకు ముంపు

Posted: 08/13/2014 06:13 PM IST
Prakash javadekar statement on polavaram

పోలవరం ప్రాజెక్టు వివాదం ఇంకా ముగిసిపోలేదు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి బాలారిష్టాలను ఎదుర్కుంటున్న ఈ ప్రాజెక్టుకు ఇంకా పలు అనుమతులు రావాల్సి ఉంది. కీలకమైన తెలంగాణలో ముంపు గ్రామాల అంశం హై డ్రామాల మద్య ఓ కొలిక్కి వచ్చింది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఏడు మండలాలను ఏపీలోకి కలిపింది కేంద్రం. దీంతో తెలంగాణ నుంచి ప్రాజెక్టుకు అడ్డంకి రాకుండా చెక్ పెట్టింది. ఇక ముంపు మండలాల సమస్య, పరిష్కార బాద్యత ఏపిదన్నమాట. వారి పునరావాసం, పరిహారం అన్ని బాబు సర్కారు చూసుకోవాల్సింది. అయితే ఈ గ్రామాల విలీనం బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా ఇంకా పోరాటం చేస్తామని అప్పుడప్పుడూ టీఆర్ఎస్ అంటోంది. ఇక ఎంత చేసినా లాభం ఉండదని వాళ్ళకూ తెలుసు అయినా సరే సమస్యను అలా కొనసాగించాలి కాబట్టి అనక తప్పదు.

మూడు రాష్ర్టాల్లో ముంపు గ్రామాలు

పోలవరం ప్రాజెక్టు వల్ల మూడు రాష్ర్టాల్లో గ్రామాలు ముంపునకు గురవుతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఈ అంశంపై బుధవారం ప్రకటన చేశారు. ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ లోని 276 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. ఏపీతో పాటు ఒడిశాలోని 8 గ్రామాలు, ఛత్తీస్ గడ్ లో 4 గ్రామాలు ముంపుకు గురవుతాయన్నారు. భూమి పరంగా చూస్తే మొత్తం 3,427 హెక్టార్ల భూమి మునిగిపోతుందని పార్లమెంటుకు వివరణ ఇచ్చారు. చట్ట ప్రకారం ముంపు బాధితులకు పునరావాసం, పరిహారం కల్పిచబడుతుందన్నారు. నిబంధనలకు లోబడి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని హామి ఇచ్చారు. అనేక అవాంతరాలను ఎదుర్కుని ఓ వివాదాస్పద ప్రాజెక్టుగా ముద్రపడ్డ పోలవరం పూర్తవుతుందా.., తమకు నీళ్ళు వస్తాయా అని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : polavaram  prakash javadekar  trs  andhrapradesh  

Other Articles