Girl posts nude pictures of boyfriend on facebook at lucknow

Girl posts nude pictures, facebook, morphed pictures, girl friend revenge, devesh sharma, fake Facebook profile, Revenge Porn images,

Girl posts nude pictures of 'boyfriend' on Facebook at lucknow:In a strange turn of events a 20-something girl created a fake Facebook profile of her so-called boyfriend and put up morphed obscene photos

అమ్మాయి డిమాండ్ -నవ్వులపాలైన అబ్బాయి!

Posted: 08/13/2014 03:38 PM IST
Girl posts nude pictures of boyfriend on facebook at lucknow

అమ్మాయి డిమాండ్ -నవ్వులపాలైన అబ్బాయి..! వారేవా!! అమ్మాయి డిమాండ్ చేసింది.. అబ్బాయి కాదన్నాడు! అంటే మీరు మరోలా అనుకొండి? 50 ఎస్ ఎం ఎస్ లు.. వంద సార్లు ఫోన్ చేసి బెదిరించింది. చివరకు ఇలా బరితెగించింది. ఇప్పుడు అబ్బాయిని ఘోరంగా వేధించి వదిలిపెట్టింది. ఇప్పటికి మనం అబ్బాయిలు.. అమ్మాయిలను ఏడిపించి, వేదించేవారిని చూసి ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.

ఫేస్ బుక్ లో పరిచయం అయిన అబ్బాయిలకు ఈ అమ్మాయి పగటి చూక్కలు చూపిస్తుంది. అంతేకాదు ఆ అబ్బాయిని ముప్పుతిప్పలు పెట్టి , మూడు చెరువుల నీరు తాగిస్తుంది. ఏకంగా అతడి పేరు మీద ఫేక్ అకౌంట్ ను ఫ్రారంభించి, అతి తెలివి తేటలతో.. ఆ అబ్బాయి ఫోటోలను నగ్నంగా మార్చి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తుంది.

ఇది జరిగింది ఎక్కడో కాదు.. మన దేశంలోని.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో సరిగ్గా ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. తన బోయ్ ఫ్రెండ్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి పాడు పనులు చేయటానికి ఫేస్ బుక్ ను వాడుకుంది. '20 సమ్ థింగ్ గాళ్' అనే పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఉన్న ఓ యువతి అతడికి పరిచయం అయ్యింది. వాళ్లిద్దరూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అయితే కొంత మని కావాలని అడిగింది. ఇలా మొదలుపెడితే ఇక తన పని అంతేనని అర్థం చేసుకున్న దేవేష్ శర్మ.. ఆమెను కలవకుండా ఊరుకున్నాడు.

అప్పటికి వాళ్లు ఒకసారి కూడా కలవలేదు. అయితే ఇంటర్ నెట్ లోను, ఫోన్ లో మాత్రం ఆమె అతడిని పలకరిస్తూనే ఉంది. మళ్లీ ఖరీదైన బహుమతులు అడగడంతో దేవేష్ ఎందుకొచ్చిందని ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాతి రోజు ఏకంగా వంద సార్లు ఫోన్ చేసి, 50 ఎస్ఎంఎస్ లు ఇచ్చింది. తన డిమాండ్లను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఎస్ఎంఎస్ లలో బెదిరించింది.

అలా బెదిరించిన కొద్ది రోజులకే అతడి నగ్న ఫోటోలు ఫేస్ బుక్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఖంగు తిన్న దేవేష్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. ఫేస్ బుక్ ఫేక్ లేడీని పోలీసులు పట్టుకున్నారు. దీంతో అతని పగతోనే ఇలా చేశానని చెప్పటంతో ఫోలీసులు షాక్ తిన్నారు. కానీ ఆ అబ్బాయిని అందరి ముందు పరువుతీసింది. పోలీసులు మాత్రం చిన్న క్షమాపణ చెప్పించి ఆ అందమైన అమ్మాయిని వదిలిపెట్టి, అబ్బాయిని ఏడిపించిన మొదటి ఫేస్ బుక్ కేసు ఇదే అని నవ్వుకున్నారు. కానీ అబ్బాయి పరువు మాత్రం గంగలో కలిసిపోయింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook Case  Facebook Case issue  Facebook  fake Facebook profile  

Other Articles