Telangana cm kcr orders to stop metro rail works in hyderabad city

telangana cm kcr, metro rail works in hyderabad, telangana cm kcr orders, metro rail works, TRS KCR

telangana cm kcr orders to stop metro rail works in hyderabad city:

మెట్రో రైలు పనులు నిలిపివేయండి? సిఎం కేసిఆర్

Posted: 08/13/2014 11:47 AM IST
Telangana cm kcr orders to stop metro rail works in hyderabad city

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నగరంలో జరుగుతున్న మెట్రో రైలు పనులపై ఆదేశాలు జారీ చేయటం జరిగింది. తక్షణం నగరంలో జరుగుతున్న మెట్రో పనులు నిలిపివేయండి. దీంతో మెట్రో సంస్థ అధికారులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. అంటే శ్వాశతంగా కాదులేండి.. కేవలం కొన్ని రోజులు మాత్రమే మెట్రో పనలు నిలిపివేయలని సీఎం కేసిఆర్ సూచింనట్లు తెలుస్తోంది.

మెట్రో పనులు నిలుపుదల చేయటానికి బలమైన కారణం ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మొదటి సారి అంతర్జాతీయ మెట్రోపాలిస్ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెట్రో పనులకు బ్రేక్ పడింది. అది దృష్టిలో పెట్టుకోని మెట్రో పనులకు కొన్నాళ్ల పాటు ఆపాలని జీహెచ్ఎంసీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ అధారిటీని ఆదేశించింది.

అక్టోబర్ 6 నుంచి 10 వరకు హైదరాబాద్ లో మెట్రోపొలిస్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి 60 దేశాల నుంచి సుమారు 2వేల మంది అంతర్జాతీయ ప్రతినిధులు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ సదస్సు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీలు మెట్రోపొలిస్ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచడానికి... అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ షోకస్ చేయడానికి ఈ సదస్సును ఉపయోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

మెట్రోపాలిస్ సదస్సు ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ లోని 22 ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ పనుల కోసం తెలంగాణప్రభుత్వం 500కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీకి కేటాయించింది. హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలకు కొత్త వన్నెలు అద్దడం లాంటి పనులను జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఈ పనులు చేయడానికి మెట్రో రైల్ పనులు ఆటంకంగా ఉంటాయని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో, మెట్రోపనులు చేయడానికి రోడ్లపై ఉన్న యంత్రాలు, సామాగ్రిని తొలగించాలని... బారికేడ్లను ఎత్తివేయాలని జీహెచ్ఎంసి ఆదేశించింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles