Camera in trial room stuns shopper in bangalore shopping mall

Camera in trial room , dress Trial room, Clothing showroom, hidden cameras, Bangalore, Vittal drasses, hideen camera in trial room, customers stuns, customers complaint, 3 shoppers arrest

Camera in trial room stuns shopper in bangalore shopping mall: Camera in trial room stuns shopper, 3 held. Posted ... Gandhi Bazaar and DVG Road in Basavanagudi make up one of the busiest shopping areas in the city

బట్టలు విప్పుతున్నారా? కొంచెం జాగ్రత్త!

Posted: 08/12/2014 02:43 PM IST
Camera in trial room stuns shopper in bangalore shopping mall

పండగొచ్చిన, పార్టీ చేసుకొన్న, పాసైన, పెళ్లైన .. ఇలా అనే సందర్బాల్లో కొత్త బట్టలు కొనటం అందరికి అలవాటు. ఇప్పుడు ఈ అలవాటే.. మన పరువు తీస్తుంది. ప్రజల్లో ఉన్న విక్ నెస్ ను క్యాష్ చేసుకోవటానికి అనేక రకాల కంపెనీల, షాపులు రోడ్డుపైకి వచ్చాయి. పెద్ద బట్టల షాపింగ్ మాల్స్ వచ్చాయి. దీంతో వినియోగదారుడికి అన్నీ సౌకర్యాలు ఒకే చోటు దొరుతున్నాయి. అందుకే వినియోగదారులు .. బట్టల షాపింగ్ మాల్స్ వైపు పరుగులు తీసి, పరువు పొగొట్టుకున్నారు.

ఇటీవల కాలంలో.. అన్నీ ప్రాంతాల్లో కామాంధలు కనిపిస్తున్నారు. ఆడవాడు అడుగు తీసి అడుగేసే లోపు.. వారి లో అందాలను కెమెరాలో బంధించే బద్మాష్ గాళ్లు ఎక్కువైనారు. దీంతో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. రీసెంట్ గా బెంగళూర్ లో ఒక బట్టల షోరూంలో ఒక సంఘటన జరిగింది.

ఆ షోరూం వెళ్లిన ప్రతి ఒక్కరు .. అక్కడ ట్రయల్ రూంల్ ఉన్న కెమెరాలో బంది కావాల్సింది. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు గానీ, ఈనెల 7 తేదీన బట్టల షోరూం ట్రయల్ రూం లో రహస్య కెమెరాల విషయం బయట పడింది.

బెంగళూర్ గాంధీబజార్‌లోని డీవీజీ రోడ్డులో విఠల్ డ్రస్సెస్ పేరుతో షోరూంను నిర్వహిస్తున్నారు. వీరి షాపులో బాష అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈనెల 7వ తేదీ ఒక అమ్మాయి ఆ షాపులోకి వచ్చింది. ఆమెకు నచ్చిన బట్టలు తీసుకొని ట్రయల్ రూపంలోకి వెళ్లింది. అయితే ఆమె బట్టలు విప్పి, కొత్త బట్టలు మార్చుకుంటున్న సమయంలో.. చిన్న వైరు కనిపించింది. అంతే .. ఒక్కసారిగా షాక్ తింది. ఆమె నగ్నం రూపం.. అక్కడున్న చిన్న కెమెరాలో బందీ అయ్యింది. దీంతో వెంటనే ఆమె తన భర్త కు విషయం చెప్పటంతో. అతను ఆవేశంగా.. షాపు యజమానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. షాపు యజమాని ఈ దంపతులపై సీరియర్ అయ్యి వారిని షాపు నుండి బయటకు పంపించారు. ఆ దంపతులు వారి బంధువులను పిలుచుకుని వచ్చి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

దీంతో ఈ విషయం పెద్దది కావటంతో .. అక్కడి మీడియా రావటంతో, వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయటం అన్నీ పది నిమిషాల్లో జరిగాయి. దీంతో ఆ షోరూం నుండి ముగ్గురు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి అనేక చోట్ల జరుగుతున్నాయి. మీరు షోరూం కు వెళ్లి బట్టలు విప్పేటప్పుడు.. కొంచెం జాగ్రత్త!! లేకపోతే పట్టపగలే .. మీ పరువు పోతుంది!! బీ కేర్ పుల్ !

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles