Bjym bjp activists create ruckus at playboy club opening

Playboy club in hyderabad, trs party like playboy, bjp fire on playboy club, bjym activists angry on playboy,

BJYM (bjp) activists create ruckus at Playboy club opening: he Internation Playboy club which has many branches across the world has set its foot on Indian soil in Hyderabad. The club is being.. Bharatiya Janata Yuva Morcha stops Hyderabad Playboy club from opening.

ప్లేబాయ్ పై బిజేపిం BJYM నేతల దాడి!టీఆర్ఎస్ లీడర్స్ ఫైర్

Posted: 08/10/2014 10:26 AM IST
Bjym bjp activists create ruckus at playboy club opening

భాగ్య నగంలో ప్లేబాయ్ పై బిజేపి నేతలు దాడి చేయటం జరిగింది. దీంతో టీఆర్ఎస్ నేతలు పరుగులు తీశారు. దీంతో ఇప్పుడు ప్లేబాయ్ వివాదం నగరంలో బాగా ముదిరిపోయింది. బిజేపి నేతలు మాత్రం నగరంలో ప్లేబాయ్ కనిపిస్తే కల్చివేస్తామని గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. దీంతో.. తెలంగాణ గవర్నమెంట్ కు ప్లేబాయ్ తలనొప్పి పట్టుకుంది. ప్లేబాయ్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న నొవాటెల్ హోటల్ లో ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటును బిజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

భారతీయ సంస్కృతిని నాశనం చేసే ప్లేబాయ్ క్లబ్బును ఏర్పాటు చేయనీయమని తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్రమంలో నిన్న రాత్రి ప్లేబాయ్ క్లబ్బును ఏర్పాటు చేస్తున్న నొవాటెల్ హోటల్ లో బిజేపి కార్యకర్తలు అలజడి సృష్టించారు. ఒక్కొక్కరుగా హోటల్ లోకి ప్రవేశించిన బిజేపి కార్యకర్తలు ప్లేబోయ్ ఏర్పాటుకు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రిసెప్షన్ కౌంటర్ వద్ద ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తోందంటూ బీజేవైఎం మరియు బిజేపి కార్యకర్తలు మండిపడ్డారు. దేశంలోని ఏ ఇతర నగరంలో ప్లేబాయ్ క్లబ్బుకి అనుమతి ఇవ్వలేదని... కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అనుమతి మంజూరు చేసిందని ఆరోపించారు.

అయితే ప్లేబాయ్ తో టీఆర్ఎస్ నేతలకు అవసరం ఏమిటి? తెలంగాణ ప్రజలను జీవితాలను నాశనం చేయటానికి ప్లేబాయ్ ని రంగంలోకి దించుతున్నారని బిజేపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసిఆర్ సర్కార్ మాత్రం ప్లేబాయ్ విషయంలో వెనకడుగు వేసే పనిలేదని కచ్చితంగా చెబుతుంది. చివరకు నగరంలో ప్లేబాయ్ వివాదం ఎటువైపు వేళుతుందో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles