Woman who posed as dupilcate collector of chennai arrested

dupilcate collector in chennai, fake district collector, district collector, salem, cheating, police

woman who posed as dupilcate collector of chennai arrested: A woman who posed as the 'District Collector' of Chennai and conned people over a period of time has been arrested at Edapadi town, police

కల్తీ కలెక్టర్ ఆసుపత్రితో హల్ చల్ !

Posted: 08/09/2014 03:06 PM IST
Woman who posed as dupilcate collector of chennai arrested

కల్తీ సరులకులు చూశాం, కల్తీ మనుషులను చూశాం గానీ.. కల్తీ కలెక్టర్ ఎప్పుడైన ఎక్కడైన చూశారా? అయితే ఈ కల్తీ కలెక్టర్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. నిత్యం అమ్మ భజన జరిగే తమిళనాడులోనే.. కల్తీ కలెక్టర్ ఆసుపత్రిలో హల్ చల్ చేయటం జరిగింది.

26 సంవత్సరాల యువతి జిల్లా కలెక్టర్ గా నటిస్తూ.. ప్రజలను, వ్యాపారస్థులను మోసం చేస్తున్న తమిళనాడు యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కల్తీ కలెక్టర్ ..అసలు విషయం ఏమిటంటే.. సేలంలోని ఈడపడి పట్టణంలో ఓ రహదారి విషయంలో జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి వారికి చికిత్స జరుగుతున్న ఆస్పత్రికి వెళ్లిన ఆమె...తాను జిల్లా కలెకర్ట్నంటూ ఫేక్ ఐడెంటిటీ కార్డు చూపించి.... అక్కడివారిని తన ప్రశ్నలతో హడలు కొట్టింది.

కలెక్టర్ రాకతో ఆసుపత్రిలోని సిబ్బంద, వైద్యులు.. భయంతో పరుగులు తీసారు. అయితే కల్తీ కలెక్టర్ ఆవేశంగా వైద్యులతో అపాయం ఉందంటూ ఫిర్యాదు చేసింది. దీంతో ఆస్పత్రికి వర్గాలు ధైర్యం చసి ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో కల్తీ కలెక్టరమ్మ బండారం బయటపడింది. కలెక్టర్ గా చెప్పుకుంటూ ఆ యువతి పలువురిని మోసగించినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ యువతి కల్తీ కలెక్టర్ అవతారం ఎందుకు ఎత్తిందో తెలుసుకోవటానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles