Pawan kalyan janasena party to be identified by election commission after 23 august

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan janasena, pawan kalyan political party, pawan kalyan movies, pawan kalyan janasena party news, pawan kalyan campaign

pawan kalyan janasena party to be identified by election commission after 23 august : power star pawan kalyan janasena party to be identify as political party by election commission after 23 august

ప్రజల మధ్యలోకి పవన్ ‘‘జనసేన’’!

Posted: 08/09/2014 11:57 AM IST
Pawan kalyan janasena party to be identified by election commission after 23 august

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను రాజకీయరంగంలోకి వస్తున్నానంటూ పేర్కొంటూ.. మార్చి 11వ తేదీన ‘‘జనసేన’’ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే! అయితే అప్పట్లో ఈ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు లేనికారణంగా దీనికి అంతగా గుర్తింపు లభించలేదు. పైగా పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అప్పట్లో స్పష్టం చేశారు కూడా! అయితే సామాన్య ప్రజల కోసం నేనున్నానంటూ తన పార్టీని పక్కనపెట్టేసి... బీజేపీ - టీడీపీ పార్టీలకు మద్దతుగా ఆయన ఎన్నో ప్రచారాలు చేశాడు. దాంతో జనంమెచ్చిన నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నాడు.

ఎన్నికల అనంతరం పవన్ కల్యాణ్ రాజకీయమౌనాన్ని పాటించాడు. టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు ఈయనకు ఏ మంత్రి పదవి ఇవ్వడానికైనా సిద్ధమని ప్రకటించినప్పటికీ... ‘‘నేను పదవి ఆశించి పార్టీ పెట్టలేదు’’ అని ప్రకటన విడుదల చేసి, మళ్లీ రాజకీయంవైపు తిరిగి చూడలేదు. అయితే ఇంతలోనే తన ‘‘జనసేన’’ పార్టీని, తన పేరును ఉపయోగించి ఎవరో తప్పుడు పనులు చేస్తున్నారని... సేవా కార్యక్రమాల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న పవన్ కల్యాణ్... ఆ అంశం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదని భావించిన ఆయన తన పార్టీని అనూహ్యంగా విస్తరించాలనతో ‘‘జనసేన’’ను రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఈ దరఖాస్తులో పార్టీ అధ్యక్షుడు, ఛైర్మన్ గా పవన్ కల్యాణ్ వుంటారని పేర్కొన్నారు. అలాగే పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన అత్యంత సన్నిహితుడైన బి.రాజు రవితే, కోశాధికారిగా ఎం.రాఘవయ్య తదితర పేర్లతో నమోదు చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని లివింగ్ స్పేసెస్ వ్యాలీ వ్యూ, కండొమోనియం, ఫ్లాట్ నెంబర్ 91, రెండో అంతస్తు పార్టీ కార్యాలయంగా నిర్ణయించినట్టు అందులో పేర్కొన్నారు. ఈ విధంగా పవన్ దరఖాస్తు సమర్పించగా... ప్రజాప్రాతినిధ్యచట్టంలోని నిబంధనల ప్రకారం దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఆ ప్రక్రియను పూర్తిచేసే పనిలో పూర్తిగా మునిగిపోయింది.

ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ తన ‘‘జనసేన’’ పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవాలని సమర్పించిన దరఖాస్తుపై ఎవరైనా అభ్యంతరాలు తెలుపాలనుకున్న పక్షంలో.. ఈనెల 23వ తేదీలోపు తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘం శుక్రవారంనాడు ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ విషయం మీద ఇంకా అభ్యంతరాలు అయితే వెల్లడవ్వలేదు కానీ.. పవన్ కల్యాన్ ‘‘జనసేన’’ పార్టీ త్వరలోనే జనం మధ్యకు వస్తోందని ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలైన నాయకుడు ఎలా వుండాలో చూపించడానికి మా అన్నయ్య రాజకీయ రంగంలోకి వస్తున్నాడు’’ అంటూ నినాదాలు చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles