(Image source from: the top countries in the world are ready for third world war)
ప్రస్తుతం అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మూడోప్రపంచం యుద్ధం త్వరలోనే జరగబోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇది గనుక నిజమే అయితే.. కేవలం అగ్రరాజ్యాలు మాత్రమే కాదు.. యావత్తు ప్రపంచంమొత్తం మీదున్న చిన్నచిన్న రాజ్యాల మధ్య కూడా యుద్ధం సంభవించడం ఖాయం! రెండో ప్రపంచయుద్ధంలో కూడా దాదాపు ఇటువంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. పరస్పర మంచి బంధాలున్న దేశాలు ఏకమై ఇతర దేశాల మధ్య ప్రతీకార చర్యలు సాగించాయి. ఇప్పుడు తాజాగా అటువంటి సూచనలే కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే ఉక్రెయిన్ విమానం తమ బార్డర్ లోకి ప్రవేశించిందని రష్యా దానిని బాంబు దాడితో నాశనం చేయించిన విషయం తెలిసిందే! అయితే శత్రువులు తమ మీద దాడికి దిగుతున్నాయన్న సంకేతాల నిమిత్తం ఆ విమానాన్ని గుర్తించకుండా పొరపాటున దాడి చేసేశామని రష్యా క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. కానీ రష్యా చేసిన ఈ పనితీరుకు అమెరికా, ఐరోపా వంటి అగ్రరాజ్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన నేపథ్యంలో ఆ రెండు రాజ్యాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇక అంతే సంగతులు! దీంతో మండిపడిన రష్యా.. తనపై ఆంక్షలు విధించిదన్న కోపంతో అంతర్జాతీయ సమాజంపై ప్రతీకారచర్యాలు ప్రారంభించేసింది.
ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి ఆహార పదార్థాల దిగుమతిని నిలిపివేయాలని.. యూరప్ దేశాల నుంచి పండ్లు - కూరగాయాలను కొనుగోలు చేయరాదని రష్యా ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారిక మీడియా ‘‘నొవోస్తి’’ వెల్లడించింది. కాగా.. ఐరోపా దేశాల నుంచి కూరగాయాలను - పండ్లను దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా ప్రధానమైంది. అలాగే అమెరికా నుంచి ఆహారపదార్థాలను దిగుమతి చేసుకోవడంలో రష్యా 23వ స్థానంలో వుంది. అంటే అమెరికా, ఐరోపా దేశాలకు రష్యా నుంచే దాదాపు చాలా లాభాలు వస్తున్నాయని నిర్ధారించుకోవచ్చు. కానీ అవి ఉక్రెయిన్ నేపథ్యంలో ఆంక్షలు విధించడంతో రష్యా తనదైన రీతిలో వాటికి జవాబు ఈ విధంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
రష్యా తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘ఇది పౌరులకు ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం వుంది’’ అని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అలాగే ఐరోపా దేశాల ఆయా ప్రభుత్వాలు కూడా ఈ రష్యా నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇదిలావుండగా.. రష్యా ప్రవర్తిస్తున్న తీరుచూస్తుంటే త్వరలోనే అది ఉక్రెయిన్ రాజ్యంపై దాడికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోందని నాటో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎలాగైనా దాడికి దిగాలనే నేపథ్యంలోనే రష్యా అంతర్జాతీయ సమాజంతో సంబంధాలను తెంచుకుంటోందని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదేగనుక నిజమైతే... మూడో ప్రపంచ యుద్ధం ఖాయమని వారంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more