Smartphone saved man from bullet

samsung mobile phones, samsung galaxy s4 smartphone, smartphone saved man life, samsung waterproof smartphone, samsung bulletproof smartphone, latest versions of samsung smartphones, samsung galaxy phones

smartphone saved man from bullet : Samsung galaxy s4 smartphone saved a man's life from bullet attack in china and became a bullet proof mobile in the world

బుల్లెట్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్.. తుపాకీ గుండును మింగేసింది!

Posted: 08/04/2014 06:34 PM IST
Smartphone saved man from bullet

నిన్నమొన్నటి వరకు మనకు స్మార్ట్ ఫోన్లలో రకరకాల ఫీచర్స్ తో విడుదలైన సంగతి తెలుసు! ఇప్పటివరకూ వాటర్ ప్రూఫ్, స్ర్కాచ్ ప్రూఫ్, శాటర్ ప్రూఫ్ వంటి రకరకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో హల్ చల్ చేశాయి. ఇప్పటికీ తయారీదారులు రకరకాలుగా పుంతలు తొక్కుతూ సరికొత్త ఒరవడితో కూడిన స్మార్ట్ ఫోన్లను తయారుచేస్తూనే వున్నారు. ఇటువంటి తయారుల్లో ముందుగా పేరొచ్చేది శ్యాంసంగ్ దేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇంతవరకు ట్రెయిన్ బోగీలతో పోటీపడుతూ ఎస్1, ఎస్2, ఎస్3 అంటూ ఎన్నోరకాల మోడల్స్ తోపాటు అంతరిక్షంలో వున్న గేలక్సీలను సైతం వదలకుండా గేలక్సీ నోట్, గేలక్సీ గ్రాండ్ వంటి రకాలను కూడా విడుదలను చేసింది.

ఇదిలావుండగా.. తాజాగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో శ్యాంసంగ్ కంపెనీవారు తమ ఫోన్ ‘‘బుల్లెట్ ప్రూఫ్’’ అంటూ డప్పులు వాయించుకుంటోంది. ‘‘ఇదేంటి..? ఈ కంపెనీవారు మరీ ఇంత విడ్డూరంగా ప్రవర్తిస్తోంది..? మార్కెట్ లో కొత్త రకాలు వస్తున్నాయి కదా అని యూజర్లు కొనుక్కుంటుంటే... వాళ్లను పిచ్చోళ్లనుకుందేమో! మరీ ఇంతగా డప్పు వాయించుకోవాలా..?’’ అని కొంతమంది సెటైర్లు వేస్తే.. దానికి బదులుగా ఆ కంపెనీ వారందరూ నోరు మూసుకునేలా సమాధానం ఇచ్చింది. ఈ విషయాన్ని మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ.. దీనికి సంబంధించి ఒక విశేషమైన సంఘటన కూడా జరిగింది!

అసలు విషయం ఏమిటంటే.. చైనాలో ఇద్దరు స్నేహితులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వారికి ఒక పర్సు దొరికింది. అయితే ఆ పర్సు నాదని నాదంటూ ఒక్కొక్కరు వాదులాడుకోవడం మొదలుపెట్టేశారు. ఆ నవ్వులాట కాస్త సీరియస్ గా మారిపోయింది. అంతే! వారిద్దరిలో ఒకరి దగ్గర వుండే పిస్టల్ ను బయటికి తీసే ఇంకొకడి గుండెల మీద గురిపెట్టి తుపాకీ కాల్చాడు. బుల్లెట్టు సూటిగా గుండెల్లో దిగి.. ప్రాణాలు పోయాయని అనుకున్నాడు కానీ.. అదృష్టం బాగుండి ఆ వ్యక్తి బతికి బయటపడ్డాడు. ఇదెలా సాధ్యమయిందని ఇద్దరు తమ మొహాలు చూసుకున్నారు. అప్పుడు బయటపడింది.. అసలు విషయం!

అతని జేబులో శ్యాంసంగ్ గేలక్సీ ఎస్4 మొబైల్ ఫోన్ వుంది. ఆ వ్యక్తి తన పై జేబులో ఫోన్ పెట్టుకోగా.. ఆ తుపాకీ గుండును సైతం అది ఎదుర్కొని మనిషి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటనలో మొబైల్ బ్రేక్ అయ్యింది కానీ.. మనిషి ప్రాణాలు మాత్రం పోలేదు. దీంతో చచ్చాన్రాబాబు అని అనుకున్న ఆ వ్యక్తి.. బతికి బయటపడ్డానురా బాబు అంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో శ్యాంసంగ్ మొబైల్ బుల్లె ప్రూఫ్ అని నిరూపించుకుంది. ఇదే విషయాన్ని తెలుసుకున్న కంపెనీలు పెద్దలు కూడా కొద్దిసేపు వరకు షాక్ కు గురయ్యారట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles