14 district in ap name after revolutionary alluri sitarama raju

14th district of AP state, Alluri Sitarama Raju AP new district, Tribal hero Alluri Sitarama Raju, AP State reorganization Bill, ordinance merging 7 mandals in AP

14 district in AP name after revolutionary Alluri Sitarama Raju: Present AP districts 13 unfavorable number

ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాకి విప్లవవీరుడి పేరు

Posted: 07/31/2014 02:47 PM IST
14 district in ap name after revolutionary alluri sitarama raju

రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ తో ఆంధ్రప్రదేశ్ లో కలుస్తున్న ఏడు మండలాలకు మరో 3 మండలాలను పశ్చిమ గోదావరి నుంచి విడదీసి కలుపుతూ 14 వ జిల్లాగా ఏర్పాటు చెయ్యాలనే ఆలోచనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాకి గిరిజనులకు అండగా నిలిచిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడదామని అనుకుంటున్నట్లుగా సమాచారం.

మన్యం ప్రాంతంలో గిరిజనల మీద బ్రిటిష్ వారి అత్యాచారాలను ఎదుర్కుని, తిరుగుబాటుతో మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించిన అల్లూరి రామరాజు పేరు ఆ ప్రాంతాలకు పెట్టటం వలన ముంపు వలన జనజీవనం అస్తవ్యస్తమవుతుందని ఉద్యమిస్తున్న గిరిజనులకు కూడా కాస్త ఉపశమనం కలిగించేలా ఉండవచ్చన్నది కూడా ఆలోచన కావొచ్చు.  

ఏడు మండలాల్లో నాలుగు మండలాలను తూర్పు గోదావరి జిల్లాలోను మూడు మండలాలను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కలపాలన్నది ముందుగా చేసిన ప్రతిపాదన కానీ దాన్ని మార్చి ఆ ఏడు మండలాలకు మరో మూడిటిని పగోజీ నుంచి కలపటంలో అంతర్యాన్ని ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ఇలా చెప్తోంది- ఆ గిరిజన ప్రాంతాలకు తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు దూరమైపోతాయి.  అందువలన కొత్తజిల్లాగా చేసినట్లయితే గిరిజన ప్రాంతానికి ఇబ్బందిలేకుండా ఉంటుంది

రెండవ కారణం ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల సంఖ్య 13 రాష్ట్రానికి మంచి చెయ్యదనే భావన కూడా ఉంది.  అందువలన పై కారణాలతో పాటు మరో జిల్లాను ఏర్పాటు చేసి 13 కలిగించే అశుభాన్ని తొలగించాలనే ఆలోచన కూడా ఉన్నట్లుగా కనపడుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles