Yoga cured cm siddharamaiah sleep apnea

cm siddharamaiah sleep apnea, karnataka cm siddharamaiah yoga practice, yoga pranayama cure sleep apnea, rahul gandhi nap in parliament, obesity gets sleep apnea, yoga remedy to sleep apnea

Yoga cured Karnataka CM Siddharamaiah sleep apnea; Siddharamaiah dozed in Assembly

యోగాతో నిద్రలోకి జారుకునే వ్యాధిని అధిగమించిన సిఎం

Posted: 07/25/2014 05:35 PM IST
Yoga cured cm siddharamaiah sleep apnea

ఊరికే కళ్ళు మూతలుపడటం, తన ప్రమేయం లేకుండా నిద్రలోకి పోయి గుర్రు కొట్టటం నిద్రలేమికి వ్యతిరేకమైన వ్యాధి.  నిద్ర లేమిలో రాత్రుళ్ళు కూడా నిద్రపట్టకపోవటం, దానితో రోజంతా చురుగ్గా లేకపోవటం జరుగుతుంది.  అందుకు వ్యతిరేకంగా ఎప్పుడుబడితే అప్పుడు నిద్రలోకి జారుకునే sleep apnea అనే వ్యాధి కూడా ఇబ్బందికరమైనదే.  ఇదీ మనిషిని చురుగ్గా లేకుండా చేస్తుంది. ఈ వ్యాధి ఉన్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేప్ కేస్ మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో నెమ్మదిగా కునుకు తీయటం నిరసనలకు గురిచేసింది.  అయితే దాన్ని ఆయన యోగ, ప్రాణాయామాలతో అధిగమించానని చెప్తున్నారు.

గురువారం నాడు 4 గంటల కౌన్సిల్ సెషన్ లో కన్ను మూయకుండా అప్రమత్తంగా కూర్చునివుండటం సభలో అందరినీ ఆశ్చర్యపరచింది.  అందుకు కారణం ఆయన యోగ, ప్రాణాయామ చెయ్యటమేనని ఆయన స్వయంగా చెప్పారు.  2004 నుంచే తనకీ వ్యాధి సంక్రమించిందని, అంతకు ముందు ఎన్నడూ ఎరిగింది కాదని, తను బరువు పెరిగిన దగ్గర్నుంచే ఈ ఇబ్బంది కరమైన స్ధితి మొదలైందని ఆయన అన్నారు.  

ఇది అరుదైన వ్యాధేమీ కాదని, చాలా మందికి ఉండటం గమనించానని, మంత్రి హెచ్ఎస్ ప్రసాద్, మాజీ మంత్రులు కోలీవాడ్, ఎస్.రమేశ్ కుమార్ లుకూడా ఆక్సిజన్ మాస్క్ లు వాడుతున్నారని సిద్ధరామయ్య అన్నారు.  తను కూడా ముందు డాక్టర్ల సలహా మేరకు రాత్రిపూట ఆక్సిజన్ మాస్క్ లను వాడానని, దాని వలన చర్మం మీద ఎలర్జీ రావటం, మచ్చలు పడటం జరిగిందని, అందువలన వాటిని అంతటితో వదిలేసానని అన్నారు.  

పనుల ఒత్తిడిలో సమయాభావంతో శారీరక వ్యాయామం మీద దృష్టిపెట్టలేకపోయానని, ఇప్పుడు తప్పనిసరి అనిపించి యోగా ప్రాణాయామాల ద్వారా నిద్రను నియంత్రించుకుంటున్నానని అన్నారు సిద్ధరామయ్య.  

యోగా, ప్రాణాయామాలు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి, రాకుండా చేస్తాయి,  యోగా అండ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ లో యోగ ప్రాణాయామాలను అభ్యసించిన సిద్ధరామయ్య ఎప్పుడు బడితే అప్పుడు తెలియకుండా నిద్రలోకి జారుకునే sleep apnea నుండి ఆవిధంగా బయటపడ్డానని చెప్పారు.  

స్పృహ, లేక ఎరుక అనేది శారీరక వ్యవస్థ నుంచి పట్టుజారి పోవటంతో మనిషి తెలియకుండా నిద్రలోకి పోవటం జరుగుతుంది.  నిద్ర మనిషికి అవసరమే.  కానీ దానికి రాత్రి సమయాన్ని కేటాయించుకున్నాం.  అందుకు కారణం పగటిపూట వెలుగులో మన పనులు చేసుకుంటాం కాబట్టి.  యోగ ప్రాణాయామాలు శారీరక వ్యవస్థని శక్తివంతంగా చేస్తాయి కాబట్టి పోయిన నియంత్రణను మళ్ళీ సాధించుకోవటం జరుగుతుంది.  

ఈ వ్యాధి లేకపోయినా ఒక్కో సమయంలో అనాసక్తిగా ఉన్నా నిద్ర వస్తుంది.  ఎందుకంటే అనాసక్తి కూడా శారీరక వ్యవస్థ నియంత్రణను సన్నగిల్లేట్టుగా చేస్తుంది.  అందుకే మాట్లాడుతున్నప్పుడు అవతలి వాళ్ళు ఆవులిస్తుంటే వాళ్ళకి మనం చెప్పేది నచ్చక ఆ మాటలను వినటం లేదని తెలుస్తుంది.  ఈ మధ్య పార్లమెంట్ లో జోగుతూ కనిపించిన రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసించటానికి అదే కారణం.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles