Start up it village in vizag

start up it village in vizag, vizag it destination, it parks in kakinada ananthapur and chittore, kochi type it village in vizag

Start up IT village in Vizag in Kochi lines in Kerala

వైజాగ్ లో స్టార్ట్ అప్ ఐటి విలేజ్

Posted: 07/24/2014 04:04 PM IST
Start up it village in vizag

ఐటి కి కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందనటానికి అక్కడ రాబోతున్న ఐటి విలేజ్ కారణం.  

కేరళ రాష్ట్రంలో కోచి లో ఉన్న ఐటి విలేజ్ మాదిరి ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పటానికి ముందు అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జె.సత్యనారాయణ నేతృత్వంలో అధికారుల బృందం కోచి వెళ్తున్నారు.  అక్కడ ప్రయోగాత్మకంగా ఇకో సిస్టమ్ ని ఏర్పాటు చేసారని, దానితో వందలాది ఐటి కెంపెనీలు వెలిసాయని, అందువలన ఆ సిస్టమ్ ని ఇక్కడ ఏర్పాటు చెయ్యటానికి దాన్ని అధ్యయనం చెయ్యటానికి పోతున్నామని జె సత్యనారాయణ తెలియజేసారు.  రాబోయే 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి ఐటి కంపెనీలు వచ్చే విధంగా కృషి చెయ్యటానికి కంకణం కట్టుకున్నారు వాళ్ళు.  

ఐటి అభివృద్ధి కోసం తయారు చేసిన 18 పాలసీలలో ఒకటి హార్డ్ వేర్ అభివృద్ధి కోసమని, వాటిని క్యాబినెట్ ఆమోదం కోసం ఇచ్చివున్నామని,  పాలసీ మీద ఆమోదం రాగానే దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల చేత సంస్థలను స్థాపించటానికి ప్రయత్నాలు చేస్తామని సత్యనారాయణ అన్నారు.  సాఫ్ట్ వేర్ అభివృద్ధి కోసం విదేశీ సంస్థలను అమెరికా జపాన్ దేశాల నుంచి, హార్డ్ వేర్ కోసం తైవాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి సంస్థలు వచ్చేట్టుగా కృషి చేస్తామన్నారాయన.

ఐటి ఎగుమతులు కొత్త రాష్ట్రంలో .25 శాతమే ఉండొచ్చు కానీ రాబోయే 6 సంవత్సరాలలో దాన్ని 20 రెట్లు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తామంటున్నారు.

విశాఖపట్నం ఐటి కేంద్రంగా, కాకినాడ, అనంతపూర్, చిత్తూరు, విజయవాడ లలో ఐటి పార్క్ లను అభివృద్ధి చెయ్యటం ఐటి ప్రణాళికలో ఉంది.  

ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ ద్వారా ప్రోమోట్ చేస్తూ, 2017 కల్లా 2 బిలియన్ డాలర్లు, 2020 కల్లా 5 బిలియన్ డాలర్ల ఐటి పెట్టుబడులు వచ్చేట్టుగా చేస్తామంటున్నారు సత్యనారాయణ.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles