Us tourist with satellite phone held

us tourist with satellite phone held, satellite phones banned in india, satellite phones being used by extremists, controlling satellite phone is difficult

US Tourist with Satellite phone held at Chennai airport as possessing is violation of Indian Telegraphic rules

శాట్-ఫోన్ తో పట్టుబడ్డ యుఎస్ టూరిస్టర్

Posted: 07/22/2014 05:04 PM IST
Us tourist with satellite phone held

అమెరికా నుంచి భారత్ పర్యటనకు వచ్చిన మార్గోట్ గ్రీర్ ఎలిజబెత్ (27) దగ్గర శాటిలైట్ ఫోన్ ఉండటం గమనించిన చెన్నై విమానాశ్రమంలోని కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ శాఖ గార్డ్స్ ఆమెను అడ్డుకున్నారు.  శాటిలైట్ ఫోన్ ని కలిగివుండటం చట్టవిరుద్ధం కాబట్టి ఆమెను ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.  అక్కడ శనివారం రాత్రి నుంచి జరుగుతున్న విచారణ సోమవారం సాయంత్రం వరకు సాగుతూనేవుంది.  సిబి సిఐడి దగ్గర్నుంచి వివిధ పోలీసు శాఖల అధికారులు ఆమెను విచారణ చేస్తున్నారు.  

వారం రోజుల క్రితం బయలుదేరిన ఎలిజబెత్ సింగపూర్ ఇంకా ఇతర ఆసియా దేశాల పర్యటన చేస్తూ వస్తోంది.  భారత్ లో అడుగుపెట్టినప్పుడు ఆమె దగ్గరున్న శాటిలైట్ ఫోన్ ని ఎవరూ గమనించలేదు.  కానీ ఆమె తిరిగి చికాగో వెళ్తుంటే చెన్నై విమానాశ్రమంలో సెక్యూరిటీ గార్డ్స్ కి దొరికిపోయింది.  

ఇక విచారణ చాలా వరకు అయిపోయింది, ఇంకా కొన్ని చిన్న చిన్న ఫార్మాలిటీలున్నాయి, దాని తర్వాత ఆమె పంపించేస్తామని అధికారులు అంటున్నారు.

శాటిలైట్ ఫోన్ తో ఫోన్ ఆపరేటర్లతో పని లేకుండా సిమ్ కార్డ్ లేకుండా నేరుగా శాటిలైట్ సాయంతో సంభాషించుకోవచ్చు కాబట్టి దీన్ని ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎక్కువగా వాడుతున్నారు.  అందువలన ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే చోట ఈ ఫోన్లను నిషేధించటం జరిగింది.

భారత చట్టం ఏం చెప్తోంది

భారత్ లో శాటిలైట్ ఫోన్లను వెంటతీసుకుని తిరగటాన్ని నిషేధించటం జరిగింది.  ఇండియన్ వైర్ లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ది ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ది ఫారినర్స్ ఆర్డర్ ఆఫ్  1948 ప్రకారం భారత దేశంలో శాటిలైట్ ఫోన్లను వెంటతీసుకెళ్ళేవారు శిక్షార్హులు.  

ఒకవేళ విదేశీ యాత్రికుల దగ్గర శాటిలైట్ ఫోన్ కి సంబంధించిన పత్రాలు, అనుమతులు ఉన్నా, వాటిని మనదేశంలో అనుమతించాలాల వద్దా అన్నదానిలో అధికారులకు నిర్ణయాధికారాలున్నాయి.  

శాటిలైట్స్ తో అధికారులకు ఈ ఇబ్బందులున్నాయి.  

ఉగ్రవాద చర్యలకు ఆ ఫోన్లను ఉపయోగించినట్లయితే దర్యాప్తు జరిపే ఏజెన్సీలకు రియల్ టైమ్ ని ట్రాక్ చెయ్యటం కష్టమైన పని.

అంతేకాదు, ఫోన్ వాడిన రికార్డ్ లను సంపాదించటం కూడా వీలుకానిపని.  ఎందుకంటే శాటిలైట్ ఫోన్ వాడకం అది ఏ దేశానికి చెందిందో ఆ దేశం నుంచి ఉంటుంది.  ఫోన్ కాల్ డేటా, ఇంటర్నెట్ ద్వారా దర్యాప్తు బృందాలు సమాచారాన్ని స్కాన్ చేస్తాయి కాబట్టి ఈ శాటిలైట్ ఫోన్ గురించిన కాల్ వివరాలు వాళ్ళకు లభించవు.

శాటిలైట్ ఫోన్లు శాటిలైట్ ద్వారా కనెక్ట్ అవుతాయి కాబట్టి స్థానిక టెలిఫోన్ ఆపరేటర్ల ద్వారా సంభాషణను విన్నట్లుగా శాటిలైట్ ఫోన్ సంభాషణను వినటం అంటే టాప్ చెయ్యటం కుదరని పని.  

డిఫెంస్ వాళ్ళ వైర్ లెస్ సిగ్నల్స్ ను కూడా ఈ శాటిలైట్ ఫోన్లు డిస్టర్బ్ చేస్తాయి.  కొన్నిసార్లు లోకల్ పోలీస్ వైర్ లెస్ సిగ్నల్స్ ని కూడా అడ్డుకున్న సందర్భాలున్నాయి.  

శాటిలైట్ ఫోన్ ని వాడాలంటే ఏం చెయ్యాలి

26.11 ఎటాక్ తర్వాత ఈ నియమాలు మరింత స్ట్రిక్ట్ అయ్యాయి.  పాకిస్తాన్ శాటిలైట్ నుంచి యాక్సిస్ చేసి ఉపయోగించినప్పుడు భారత అధికారులు ఏమీ చెయ్యలేకపోయారు.  అందువలన డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిఫోన్స్ (డాట్) అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ ని భారత దేశంలో ఉపయోగించటం నేరంగా పరిగణించబడుతుంది.  అనుమతి (ఎన్ఓసి) ని పొందటానికి CS Cell, DoT, Room No.1204, Sanchar Bhawan, 20 Ashoka Road, New Delhi-110 001 కి అప్లై చెయ్యవలసి వుంటుంది.  దాని కాపీని ఇండియన్ ఎంబసీకి కూడా పంపవలసివుంటుంది.  ఇది ఈ దేశంలో నియమం.

బ్రిటన్, జర్మనీ, బెల్జియమ్, దేశాల నుంచి వచ్చేవారి దగ్గర శాటిలైట్ ఫోన్లను ఉపయోగించటానికి అనుమతులు కూడా ఉండవు.  వాళ్ళు మామూలు పర్యాటకులే కావొచ్చు కానీ భారత నియమాలను పాటించాలి కదా.  అయితే భారత దేశంలో సిగ్నల్స్ సరిగ్గా లేని చోట ఉపయోగించటం కోసం ఈ ఫోన్లను దగ్గర పెట్టుకుంటున్నామని చెప్తుంటారు వాళ్ళు.  పైగా మనదేశంలో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు.  అందువలన ఈ శాటిలైట్ ఫోన్ సాయంతో ఇంటర్నెట్ కి యాక్సిస్, టెక్స్ట్ మెసేజ్ పంపించటానికి, మాట్లాడుకోవటం కూడా జరుగుతుందని వాళ్ళ వాదన.  

చెన్నైలో పట్టుబడ్డి ఎలిజబెత్ కు ఆ ఫోన్ ని ఆమె తండ్రి కొనిచ్చాడట.  ఆసియా దేశాలలో రక్షణకోసం అది అవసరమని ఆయన చెప్పాట్ట.  కొన్న బిల్లు, రశీదులతో సహా పత్రాలను చూపించిందామె.  కానీ దర్యాప్తు బృందాలు సంతృప్తి చెందలేదు.  ఆ ఫోన్ నుంచి కొన్నిరోజులుగా ఎటువంటి కాల్స్ చెయ్యలేదని తెలిసింది.  ఆమె దగ్గర వాలిడ్ యుఎస్ పాస్ పోర్టు వీసాలున్నాయి కాబట్టి ఆమెను అరెస్ట్ చెయ్యం, డిటైన్ చెయ్యం కేవలం విచారణ చేస్తున్నామంతే అని చెప్తూ, ఆమె యుఎస్ నుంచి వచ్చిన పర్యాటకురాలన్నది యుఎస్ కాన్సులేట్ తెలియజేయవలసివుంటుంది.  ఆ తర్వాత ఆమె యుఎస్ కి తిరిగి వెళ్ళిపోవచ్చు.  అయితే శాటిలైట్ ఫోన్ ని కాన్ఫిస్కేట్ చెయ్యవలసివుంటుందని చెప్తున్నారు అధికారులు.

భారత దేశం వచ్చేముందు ఇక్కడ వాతావరణం, వేసుకోవలసిన దుస్తులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏమి తినకూడదు, ఏమి తినవచ్చు ఇలాంటివన్నీ తెలుసుకునే వస్తారు.  మరి శాటిలైట్ ఫోన్ల విషయంలో తెలియదా అంటే, ఆఁ వాళ్లేం చెయ్యరులే అనే ధీమా.  ఫారినర్ దగ్గరున్న ఫోన్ సంగతి వాళ్లకేం తెలుస్తుందిలే అని కొందరు, అమెరికా ప్రభుత్వం ఇచ్చిన అనుమతే ఉన్నప్పుడు భారత దేశం ఏం చేస్తుందనే ధీమా మరికొందరిలో కనిపిస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles