Fees reimbursement scheme heavy on ap

Fees reimbursement scheme heavy on AP state, Telangana decision on students nativity bothers AP, Telangana students eligibility criteria for nativity

Fees reimbursement scheme heavy on the state of Andhra Pradesh

ఫీజుల విషయంలో అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్

Posted: 07/20/2014 12:26 PM IST
Fees reimbursement scheme heavy on ap

విద్యార్థుల ఫీజ్ రియంబర్స్ మెంట్ పథకానికి 1956 కటాఫ్ డేట్ ని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒట్టిగానే నిర్ణయించలేదు.  దాన్ని అర్థం చేసుకోని ఆంధ్రా నాయకులు అది రాజ్యాంగ విరుద్ధమని, స్థానికతను నిర్ణయించటానికి అన్ని సంవత్సరాలు రాష్ట్రంలో ఉండాలన్నది సరైన వాదన కాదని అంటూ వచ్చారు.  అంటే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల స్థానికతను నిర్ణయించటానికి మేము 1956 వరకు పోము అని చెప్పినట్లే అయింది.  

ఇక తెలంగాణాలో స్థానికతను నిరూపించుకోలేని విద్యార్థులందరూ విద్యార్జనకు ఆంధ్రప్రదేశ్ కే పోతారన్నది ఖాయం.  అంతకు ముందు కూడా చదువుల కోసం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన విద్యార్థులు ఎలాగూ ఉన్నారు.  అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఫీజ్ రియంబర్స్ మెంటులో మరిన్ని కోట్ల భారం పడబోతోంది.  

ఇదీ ఎక్కువగా ఆంధ్ర పాలకులను వేధిస్తున్న సమస్య.  పోనీ మేము కూడా 1956 నే పరిగణనలోకి తీసుకుంటాం అంటే ఇంతకాలం ఆ నిర్ణయాన్ని తీసుకున్న కెసిఆర్ కి వంత పాడినట్లవుతుంది, ఇంతవరకు చేసిన వ్యాఖ్యానాలు అర్థరహితమౌతాయి.  ఇక్కడ విశాల హృదయం చూపించి పిల్లలను ఆదుకుందాం అనుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పెనుభారమౌతుంది.  అందుకే ఎటూ పాలుపోకుండా ఉంది ఈ సమస్య.  కెసిఆర్ నిర్ణయాలను తొండి అని అరవటం కంటే చేసేదేమీ లేకుండా ఉంది.

ఈ పోటీల్లో నిజంగా నష్టపోయేది మాత్రం విద్యార్థులే.  విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించటానికి చేసిన ఈ వెసులుబాటు రాజకీయాల్లో నలిగిపోయి లబ్ధిదారులకు ఫలాలు అందకుండా చేసేట్లుగా కనిపిస్తున్నాయి.  

2008 లో వైయస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ స్కీం లో 2012-2013 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ పథకం ఇంజినీరింగ్, మెడిసిన్, ఎమ్ బి ఏ, ఎమ్ సి ఏ, బిఇడి మొదలైన వృత్తిపరమైన కోర్సులను చేసే విద్యార్థులకు వర్తిస్తుంది.  ప్రతి ఇంజినీరింగ్ చదివే విద్యార్థికి సంవత్సరానికి రూ.52000 చొప్పున ప్రభుత్వమే భరిస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles