Mexican mayor marries a crocodile

Mexican Mayor marries a crocodile, Mexican Mayor weds crocodile, Mexican belief makes Mayor marry a crocodile

Mexican Mayor marries a crocodile for he sake of riches for the city

లోకకళ్యాణం కోసం మొసలితో కళ్యాణం

Posted: 07/18/2014 12:50 PM IST
Mexican mayor marries a crocodile

భారతదేశంలో వివాహ సమయంలో ఆ జంటలో వధువుకి కాని వరుడికి కాని అరిష్టమని పురోహితులు చెప్పిన సందర్భంలో వాళ్ళకి ఏ జంతువుతోనో ముడిపెట్టిన సంఘటనలు పూర్వకాలంలో ఉండేవి కానీ అటువంటి మూఢాచారాలని విడనాడి ఆధునికతను సంతరించుకున్న తర్వాత అలాంటి సంఘటనలు చోటుచేసుకోవటం లేదు.  

కానీ మెక్సికోలో ఇంకా అలాంటి నమ్మకాలున్నాయని ఈ సంఘటన తెలియేజేస్తోంది.  

మెక్సికోలో సాన్ ప్రెడో హువాయెలులా నగరానికి మేయరైన జోయల్ ఒక మొసలిని పెళ్ళి చేసుకున్నాడు.  అయితే అంత తెగించి నరమాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తినే మొసలిని ఆయన ఎందుకు పెళ్ళి చేసుకున్నాడూ అంటే సంసారం చెయ్యటానికి కాదని మాత్రం తెలుస్తూనేవుంది.  ఆ నగరంలోని రేవుకి అలా మొసలిని పెళ్ళి చేసుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకమే ఆయనను అంత సాహసం చెయ్యటానికి పూనుకునేట్లుగా చేసింది.  దానితో మత్స్య సంపద పెరుగుతుందని, దాని మీద ఆధారపడ్డ నగరం దానితో కాసులు పండించుకుంటుందని వాళ్ళ నమ్మకానికి మేయర్ వత్తాసు పలుకుతూ పెళ్ళికొడుకై మొసలి వధువుని వివాహమాడారు.  

ఆ మొసలి కూడా తక్కువ తిన్నదా.  అదీ తయారైంది పెళ్ళికూతురు వేషంలో.  కాకపోతే నోరు తెరవకుండా తలవంచుకుని కూర్చోవటం వధువుకి అలంకారం కాబట్టి దాన్ని నోరుని గట్టిగా కట్టేసి కూర్చోబెట్టారుట.  వివాహం మాత్రం కడు వైభవంగా జరిగిందంటున్నారు!

మొసలిని పెళ్ళి చేసుకుంటే నగరానికి లాభమేమో కానీ, ఒక ఇబ్బంది మాత్రం ఉంటుంది.  భార్యపోతే ఆయన నిజంగా కన్నీళ్ళు కార్చినా వాటిని మొసలి కన్నీళ్ళని అనుకునే ప్రమాదముందని వేళాకోళం ఆడటానికి అక్కడి ప్రజల నమ్మకం అడ్డు వస్తుంది కానీ ఇతర ప్రాంతాలవాళ్ళు యధేచ్ఛగా వ్యాఖ్యానాలు చేసుకున్నారట! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles