Farm loan waiver in telangana and andhra pradesh

farm loan waiver in telangana and ap, ap waives farm loans up to rs 1.5 lakh, telangana waives farm loans up to rs1 lakh, ap govt for farm loan repayment rescheduling

farm loan waiver in telangana and ap

ఋణమాఫీలకు రెండు రోజుల్లో దారి

Posted: 07/15/2014 04:05 PM IST
Farm loan waiver in telangana and andhra pradesh

రైతు ఋణాలను మాఫీ చేస్తామని ఇటు తెలంగాణా రాష్ట్ర సమితి, అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రెండూ హామీలిచ్చాయి, రెండు పార్టీలూ అధికారంలోకి వచ్చాయి, రెండిటికీ రిజర్వ్ బ్యాంక్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ వంతు శక్తివంచన లేకుండా రిజర్వ్ బ్యాంక్ అభ్యంతరాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి.  

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని కలవటం సాంకేతికమైన అభ్యంతరాలను దూరం చేసే ప్రయత్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులకు దారితీసింది.  అదేమిటంటే ఋణ మాఫీ అనకండి, రిషెడ్యూలింగ్ అనండి అని.  రిషెడ్యూలింగ్ బ్యాంక్ పరిధిలో ఉన్నదే కాబట్టి అందుకు ఆర్ బి ఐ నుంచి అభ్యంతరాలుండవు.  రుణాలమీద కట్టే వాయిదాలను రిషెడ్యూలింగ్ చేసినా ఆ మొత్తాన్ని వెంటనే కట్టవలసి అవసరం ఉండదు.  ముందే కొంత భాగమే చెల్లించవలసివుంటుంది.  దాన్ని ఎవరు కట్టినా బ్యాంక్ లకు అభ్యంతరం ఉండదు.  ఆ పని ప్రభుత్వం చేసినా బ్యాంక్ లపరిధి లోకి రాదది.  అదే ఋణమాఫీ అంటే మాత్రం సాంకేతిక అడ్డంకులుంటాయి.  
రిజర్వ్ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యక్రమమైన ఎప్పుడు ఎంతెంత చెల్లింపులు జరగాలన్నది చర్చల్లో నిర్ణయించుకోవటం జరుగుతుంది.  మొత్తం మీద లక్షన్నర రూపాయల వరకు పంట రుణాలను బంగారం పెట్టి తీసుకున్నదానితో సహా ప్రభుత్వం భరిస్తుందని చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసారు.
 
ఇక పోటీలోకి వస్తే, తెలంగాణా ప్రభుత్వం లక్షరూపాయల వరకే ఋణాల మాఫీ ఉంటుందని, అది కూడా పంట ఋణాలమీదనేనని, బంగారం పెట్టి తీసుకున్న ఋణాలను పరిగణనలోకి తీసుకోమని చెప్పింది.  దానితో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు తెలంగాణా ప్రభుత్వం కంటే ఎక్కువగా రైతులకు సాయం చేసినట్లుగా కనిపిస్తుంది.  పైగా రైతు ఋణాలు తెలంగాణాలోకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి.  మరో తేడా ఏమిటంటే, తెలంగాణాకి మిగలు నిధులున్నాయి, ఆంధ్రప్రదేశ్ కి లోటు బడ్జెట్ ఉంది.  

అందువలన తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రకటనలు ఒకరిని మించి మరొకరు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ రోజు సిరిసిల్ల ఎమ్మెల్య్ కె తారకరామారావు, రిషెడ్యూల్ కాదని తాము ఋణ మాఫీలకే కట్టుబడివున్నామని ప్రకటించారు.  అసలు మొత్తం ఋణాన్ని ఒక్కసారే ప్రభుత్వం కట్టేస్తే బ్యాంక్ లకు అభ్యంతరమే ఉండదు.  కానీ మాఫీ పేరుతో ప్రభుత్వం ఆ మొత్తాన్ని నెమ్మదిగా కిస్తుల్లో చెల్లించటం అభ్యంతరానికి తావిస్తోంది.

అంటే ఋణామాఫీలను ప్రభుత్వమే చేసి మొత్తం సొమ్ముని కట్టేస్తే బ్యాంక్ లకు ఎటువంటి అభ్యంతరమూ ఉండటానికి వీల్లేదు.  అప్పుడు బ్యాంక్ లతో చర్చల అవసరం కూడా లేదు.  నేరుగా ఆ ఋణాలను కట్టేయటమే.  ఒకళ్ళ ఖాతాలో సొమ్ముని మరో వ్యక్తికి ఇవ్వరు కానీ, ఒక వ్యక్తి తీసుకున్న అప్పును మరో వ్యక్తి వచ్చి కట్టేస్తే ఆనందంగా తీసుకుంటారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పంట రుణాలతో పాటు బంగారం పెట్టి తీసుకున్న రుణాలమీద కూడా లక్షన్నర వరకు ప్రభుత్వం భరిస్తుందని, అందుకు ఋణ చెల్లింపులను రి షెడ్యూలింగ్ చెయ్యటానికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందని, రెండు రోజుల్లో అధికారికంగా సమాచారం వెల్లడి చేస్తుందని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles