భారత దేశంలో ఏ ప్రాంతంలోనైనా పెళ్ళి చేసుకోవటానికి వరుడు వధువు ఇంటికి వెళ్ళటం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని ప్రాంతాలలో అలా తరలి వెళ్ళే వరుడి బృందాన్ని బారాత్ అంటారు. ప్రాంతాన్నిబట్టి బారాత్ లో గుర్రం మీద ఎక్కి రావటం, తలకి పూలతో చేసిన ముసుగు కానీ, తలపాగా కానీ బాషికం కాని కట్టుకోవటం లాంటివి, చేతిలో కత్తి పట్టుకోవటం, బారాత్ ముందు సంతోషాతిశయంతో డ్యాన్స్ లు చెయ్యటం జరుగుతాయి. దానికి ముందు పెళ్ళి కొడుకు వేరే ప్రదేశం నుంచి వచ్చినట్లయితే వాళ్ళందరికీ విడిది ఏర్పాట్లు చెయ్యటం జరుగుతుంది.
కానీ అందుకు విరుద్దంగా జరిగింది బీహార్ రాష్ట్రంలోని మావోయిస్ట్ లు ముమ్మరంగా కార్యకలాపాలు చేపట్టే షైక్ పురా జిల్లా ఖైర్ గ్రామంలో. వధువే పెళ్ళి కోసం వరుడి ఇంటికి బారాత్ తో పోయింది.
ఇది జరిగింది ఇలా-
షైక్ పురా జిల్లా మార్వాడీ టోలాకి చెందిన చందన్ కుమార్ కి దాని పొరుగు జిల్లా జామూయి లో ఖైర్ గ్రామానికి చెందిన వీణా కుమారికి పెళ్ళి నిశ్చయమైంది. ఈ పెళ్ళి జరిపించటానికి ఇరు కుటుంబాలలోని పెద్దలు బుధవారం నాడు శుభముహూర్తాన్ని నిర్ణయించారు. ఏర్పాట్లన్నీ జరిగాయి. వివాహవేడుకను తిలకించటానికి బంధుజనమంతా విచ్చేసింది. కానీ అసలు రావలసిన పెళ్ళికొడుకు జాడ లేదు. కారణమేమిటా అని విచారిస్తే అతగాడు అంతకు ముందు రోజు అడిగిన అదనపు కట్నం ఇవ్వటానికి పెళ్ళికూతురు కుటుంబం అంగీకరించలేదు.
అంతే ఆ తెల్లవారి పెళ్ళి కూతురే బారాత్ తో పెళ్ళి కొడుకు ఇంటికి వెళ్ళి పెళ్ళి చేస్తారా లేదా అని కూర్చుంది. ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్తామని బెదిరించటం జరిగింది.
ఈ గందరగోళం చూసి పెళ్ళి కొడుకు ఉడాయించటానికి ప్రయత్నం చెయ్యగా గ్రామస్తులు అతగాడిని పట్టుకుని పెళ్ళి మండపానికి తీసుకునివచ్చారు. పెళ్ళి కూతురు తండ్రి సంజయ్ రామ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పెళ్ళి జరిపించటానికి సహకరించిన స్థానికులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more